భూమిలో 2 లక్షలు దాచుకున్న అవ్వ.. కనిపించకపోవటంతో లబోదిబో.. చివరికి..!
పురాతన కాలంలో డబ్బు, బంగారాన్ని దొంగలు ఎత్తుకుపోకుండా.. కుండల్లో, బిందెల్లో పెట్టి భూమిలో పాతిపెట్టేవారు. అదేనండి.. అప్పుడప్పుడు భూమి తవ్వుతుంటే లంకె బిందెలు దొరికాయంటారు చూడండి అవి అవే. అలా.. ఈ కాలంలోనూ ఓ అవ్వ తన డబ్బును భూమిలో దాచి పెట్టుకుంది. అయితే.. మళ్లీ వెతికినప్పుడు దొరకకపోవటంతో.. లబోదిబోమంటూ పోలీసులకు ఆశ్రయించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
Mahabubabad: కిరాణా దుకాణం నడుపుకుంటూ.. వచ్చిన పైసలను కడుపుగట్టుకుని.. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బును దొంగలపాలు కావొద్దని అతిజాగ్రత్తతో భూమిలో పాతిపెట్టి కష్టాల్లో పడింది ఓ వృద్ధురాలు. తాను ఎవ్వరికీ తెలియకుండా భూమిలో దాచుకున్న డబ్బు కనిపించకపోయేసరికి.. పోలీసులను ఆశ్రయించింది. ఈ ఆసక్తికర ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గు తండాలో జరిగింది. తండాకు చెందిన తమ్మిశెట్టి రంగమ్మ కిరాణం షాపు నడుపుకుంటూ బతుకు సాగిస్తోంది. కిరాణం షాపు ద్వారా వచ్చే పైసా పైసా.. కూడపెట్టుకోగా.. అవి కాస్త 2 లక్షల వరకు పోగయ్యాయి.
ఎస్సై ఉపేందర్ తన సిబ్బందితో కలిసి ఇంటి ఆవరణలో మొత్తం తవ్వి చూశారు. భూమిలో పాతిపెట్టి ఉన్న రెండు లక్షల నగదు ఎవ్వరూ తీయకుండా సేఫ్‌గా ఎక్కడ పెట్టిందో అక్కడే ఉంది. అయితే.. ఆమె ఆందోళనతో ఒక దగ్గర పెట్టి ఇంకోదగ్గర వెతికినట్టుందని పోలీసులు తెలిపారు. దీంతో.. ఆ దొరికిన డబ్బును.. స్థానిక ఎంపీటీసీ కుమారి, సర్పంచ్ రమేష్ సమక్షంలో వృద్ధురాలికి అందించారు. అయితే.. డబ్బును ఇలా భూమిలో దాచుకోకుండా బ్యాంకులో దాచుకోవాలని వృద్ధురాలికి ఎస్సై సూచించారు.