భామా కలాపం-2′ మూవీ రివ్యూ

‘భామా కలాపం-2’ మూవీ రివ్యూ నటీనటులు: ప్రియమణి-శరణ్య ప్రదీప్-బ్రహ్మాజీ-సీరత్ కపూర్-రుద్ర ప్రతాప్-రఘు ముఖర్జీ-అనూజ్ గుర్వారా తదితరులు సంగీతం: ప్రశాంత్ విహారి ఛాయాగ్రహణం: దీపక్ ఎరగెర నిర్మాతలు: భోగవల్లి బాపినీడు-సుధీర్ ఈదర రచన-దర్శకత్వం: అభిమన్యు తాడిమేటి ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆహా’ వారి భామా కలాపం మంచి వినోదాన్నిచ్చి ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడా వెబ్ ఫిలింకి సీక్వెల్ తెరకెక్కింది. అభిమన్యు తాడిమేటి రూపొందించిన ‘భామా కలాపం-2’ ఆహా ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: వంటల అమితాసక్తితో యూట్యూబ్ ఛానెల్ నడిపే అనుపమ (ప్రియమణి)కు ఇరుగు పొరుగు వాళ్ల సంగతులంటే అమితాసక్తి. ఈ ఆసక్తితోనే తన అపార్ట్మెంట్లో సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చి ఒక హత్య కేసులో చిక్కుకుంటుంది. ఎన్నో ఇబ్బందుల తర్వాత ఆ కేసు నుంచి అనుపమ బయటపడ్డాక.. భర్త ఆమెతో కలిసి వేరే ఇంటికి మకాం మారుస్తాడు. అక్కడికి వెళ్లాక సొంతంగా ఒక హోటల్ తెరుస్తుంది. దాన్ని సజావుగా నడిపిస్తూ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో అనుపమ వల్ల పోలీసులకు పట్టుబడ్డ ఒక క్రిమినల్.. ఆమెను బెదిరిస్తాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ అధికారి అయిన సదానంద్ (రఘు ముఖర్జీ)ని ఆశ్రయిస్తుంది అనుపమ. కానీ అతను ఆ క్రిమినల్ కథ ముగించి.. అనుపమను ఒక దొంగతనం చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుపమ ఆ పని చేయడానికి సిద్ధపడుతుంది. ఇంతకీ ఆమె దొంగతనం చేయాల్సిన వస్తువేంటి.. రఘు దాంతో ఏం చేయాలనుకుంటాడు.. చివరికి అనుపమ ఈ టాస్క్ పూర్తి చేసి అన్ని సమస్యల నుంచి బయటపడిందా లేదా అన్నది మిగతా కథ.