బీఆర్ఎస్‌కు డబుల్ బెడ్ రూం ఇళ్లు గండమే !

 బీఆర్ఎస్‌కు డబుల్ బెడ్ రూం ఇళ్లు గండమే !

డబుల్ బెడ్ రూం ఇళ్లు అనే అందమైన కలను చూపించి పదేళ్లుగా ఓట్ల పంట పండిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ సారి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది . 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలో నిర్వహించిన సకల జనుల సమ్మెలో 22 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు లేవని గుర్తించిన ప్రభుత్వం అందరి దగ్గర దరఖాస్తులు తీసుకుంది. తర్వాత ఈ సంఖ్య మరితంగా పెరిగింది. కానీ పదేళ్లలో ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లు.. లక్షన్నర కూడా లేవు. ఊరించి ఊరించి ఉసూరుమనిపించారని దరఖాస్తుదారులు రగిలిపోతున్నారు.

గత పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించాలని ప్రతిపాదనలు పెట్టుకుంది 2 లక్షల92 వేల ఇళ్లు. ఈ ఇళ్లు నిర్మించడానికి 19 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకూ పనులు ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సంఖ్య 2 లక్షల 20వేలు మాత్రమే. ఇందులో పూర్తయినవి లక్షా 41 వేల ఇళ్లు. అంటే.. పదేళ్లలో కేసీఆర్ ఇరవై నాలుగు లక్షల మందికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి చివరికి.. లక్షన్నర ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగారు.

కానీ ఇక్కడ అసలు ట్విస్టేమిటంటే వాటిని పేదలకు పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. కొన్ని చోట్లు ఇళ్లు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా.. అర్హుల ఎంపిక మాత్రం పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తయిన ఇళ్లులో లబ్ధిదారులకు కేవలం 20 శాతమే అప్పగించారు. కట్టింది చాలా తక్కువ ఇళ్లు.. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే రాజకీయంగా నష్టం అన్న ఉద్దేశంతో ఎవరికీ పంపిణీ చేయడం లేదు. కొన్ని చోట్ల లక్కీ డ్రా తీసినా ఇళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మళ్లీ పంపిణీ అని హడావుడి చేస్తోంది. ఇస్తారో లేదో కనీ.. ఇళ్లపై ఆశలు పెట్టుకున్న వారిలో మాత్రం ఆగ్రహం కనిపిస్తోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *