బిగ్ బాస్ 18 విన్నర్ కరణ్ వీర్ మెహ్రా.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా

ప్రముఖ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్ విజేతగా నటుడు కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ తన చేతిని పైకెత్తి కరణ్ పేరును ప్రకటించారు. 46 ఏళ్ల కరణ్ వీర్ మెహ్రా ఈ షోలో విజేతగా నిలిచి రూ. 50 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.
ప్రముఖ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్ విజేతగా నటుడు కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ తన చేతిని పైకెత్తి కరణ్ పేరును ప్రకటించారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. దీంతో 46 ఏళ్ల కరణ్ వీర్ మెహ్రా ఈ షోలో విజేతగా నిలిచి రూ. 50 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. వివియన్ ద్సేనా మొదటి రన్నరప్‌గా నిలువగా, యూట్యూబర్ రజత్ దలాల్ రెండవ రన్నరప్‌గా నిలిచారు.
బిగ్ బాస్ షోలో తనదైన ఆటతో ఆకట్టుకుని విజేతగా నిలిచిన కరణ్ కు సోషల్ మీడియా వేదికగా అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. బిగ్ బాస్ షోకు ముందు కరణ్ పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లతా హై, పరి హూన్ మైన్, బడే అచ్ఛే లాగ్తే హాన్, ససురల్ సిమర్ కా, పోలీస్ & క్రైమ్, వంటి టీవీ షోలతో బాగానే పాపులర్ అయ్యాడు.
రీమిక్స్ షోతో కెరీర్
కరణ్ మెహ్రా ఢిల్లీలో జన్మించారు. ముస్సోరీలోని బోర్డింగ్ స్కూల్‌లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీలో తదుపరి చదువులు సాగించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)లో 11వ, 12వ తరగతి పూర్తి చేశాడు. కరణ్ తన అమ్మమ్మ సూచన మేరకు వీర్‌ని తన పేరులో చేర్చుకున్నాడు. వీర్ అనేది కరణ్ దివంగత తాత పేరు. 2005లో రీమిక్స్ షోతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. సోనీ SAB TV, బివి ఔర్ మెయిన్‌లో కీ రోల్ పోషించాడు . రాగిణి MMS 2 , మేరే డాడ్ కి మారుతి , బ్లడ్ మనీ , బద్మషియాన్, ఆమెన్ వంటి బాలీవుడ్ చిత్రాలలో కూడా కనిపించాడు.