పేరుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. చదువు చెప్పకుండా ఇదేం పని..

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేశాడు. పోలీసుల దాడిలో 12 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా ఉండి ఇలాంటి మోసానికి పాల్పడటంతో ఆ గ్రామ వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం ఎంతో ఉన్నతమైనది. వారు కేవలం పాఠాలు చెప్పే గురువులు మాత్రమే కాదు, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు. ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయ వృత్తికే అవమానం జరుగుతుంది.
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువు సమాజంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు సరైన మార్గనిర్దేశనం చేసేది ఉపాధ్యాయుడే. అలాంటి ఒక ఉపాధ్యాయుడు తన వృత్తికి విరుద్ధంగా, స్వార్థపూరితమైన చర్యకు పాల్పడటం అత్యంత బాధాకరం. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేయడం సభ్యసమాజం తలదించుకునే విషయం.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు అడ్డదారులు తొక్కి సొమ్ము సంపాదించాలని చూడటం అతని కర్తవ్యానికే కళంకం తెచ్చే చర్య. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సుబ్బారావు అనే వ్యక్తి సైడ్ బిజినెస్‌గా విత్తనాల వ్యాపారం చేస్తూ.. అమాయక రైతులను నమ్మించి నకిలీ విత్తనాలు అమ్ముడతున్నాడు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు సుబ్బారావు ఇంటిపై .. దుకాణంపై దాడి చేసి దాదాపు 12 లక్షల రూపాయల విలువైన నాలుగు క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనిలో ఉపాధ్యాయుడితో పాటు.. మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.