పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో లేటెస్ట్ టెక్నాలజీ..!
ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన పేదల నుంచి వచ్చిన దరఖాస్తుల వడపోత ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు లెటేస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కొందరు లబ్ధిదారులు వేరు వేరు ప్రాంతాల్లో ఉంటూ అఫ్లికేషన్లు పెట్టుకున్న నేపథ్యంలో వాటిని ఫిల్టర్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రధానాంశాలు:
- పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
- లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో లేటెస్ట్ టెక్నాలజీ
- ఏఐ టెక్నాలజీ ద్వారా అప్లికేషన్ల ఫిల్టర్
ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అప్లయ్ చేశారో తెలుసుకునేందుకు లెటేస్ట్ టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. దరఖాస్తుదారుల ఆధార్ నంబర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగించి అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. ఆ తరవాత ఆయా దరఖాస్తుదారులను సంప్రదించి వారు కోరుకున్న చోట ఆమోదం తెలిపి.. మిగిలిన దరఖాస్తులను రిజెక్ట్ చేయనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.
ఇక ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరినే అర్హులుగా ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పెళ్లిళ్ల తరవాత ఉమ్మడి కుటుంబంగా ఉన్నవారికి మాత్రం ఈ నిబంధనను వర్తింపజేయరని తెలిసింది. అఫ్లికేషన్లు ఫిల్టర్ చేసిన అనంతరం గ్రామసభలు నిర్వహించి.. అర్హులను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాదికి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి.. ఎన్ని నిధులు కేటాయించాలన్న అంశాలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ప్రణాళికను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.