పార్టీ మారిన ఎమ్మెల్యేలకు BRS బిగ్ షాక్

 పార్టీ మారిన ఎమ్మెల్యేలకు BRS బిగ్ షాక్

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. మిగతా ఏడుగురిపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్‌ఎల్‌పీ, ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకునేలా, టైం ఫిక్స్ చేసేలా ఆదేశించాలని కోరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. మిగతా ఏడుగురిపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని పిటిషన్లో పేర్కొంది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు.

ఇందులో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ ఎంపీగా సైతం పోటీ చేశారు. ఈ నేపథ్యంలో వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోంది. స్పీకర్ కు కంప్లైంట్ తో పాటు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని.. వారి స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయని బీఆర్ఎస్ టాప్ లీడర్లు అనేక సార్లు చెబుతూ వస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *