నేడు ఈ రాశివారికి అనుకున్న పని పూర్తి అయిపోతుంది..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే

 నేడు ఈ రాశివారికి అనుకున్న పని పూర్తి అయిపోతుంది..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే

కర్కాటక రాశి వారికి విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది.సింహ రాశి వారు బంధు, మిత్రులతో కలిసి వింధు, వినోదాల్లో పాల్గొంటారు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్‌ లో.

మేష రాశి వారికి ఈరోజు విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే బెటర్‌. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

వృషభ రాశి వారు ఈరోజు  ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో ఆనందంగా ఉంటారు. కీర్తి, ప్రతిష్ఠలు దక్కుతాయి. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

మిథున రాశి వారు ఈరోజు  కళాకారులు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలిసి ఆనందంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.

కర్కాటక రాశి వారు రోజు ప్రయాణాలు ఎక్కువగా చేసే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలి.

సింహ రాశి వారికి ఈరోజు  స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరం అవుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి వింధు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.

కన్య రాశి వారికి ఈరోజు ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.  కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు.

తుల రాశి వారు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశాలున్నాయి. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉంటే మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు.

వృశ్చిక రాశి వారు నేడు మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని అందుకుంటారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.

ఆకస్మిక ధనలాభం..

ధనుస్సు రాశి వారికి  కుటుంబపరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగుతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు.

మకర రాశి వారికి నేడు కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉంటే మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.

కుంభ రాశి వారు నేడు  విందులు, వినోదాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపుతారు. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త గా ఉండాలి . శారీరకంగా బలహీనులవుతారు.

మీన రాశి వారికి నేడు వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం బెటర్. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *