నాగచైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్

‘తండేల్’ సినిమా తర్వాత నాగ చైతన్య ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంచుకొన్నట్టు ఇన్ సైడ్ టాక్. మీనాక్షి.. చైతూ పక్కన నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ కాంబోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలుగు హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలే ‘లక్కీ భాస్కర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దగుమ్మ.. వచ్చే రెండు నెలల్లో మెకానిక్ రాకీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో ఆడియన్స్ ను పలకరించనుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంచుకొన్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మీనాక్షి చౌదరి.. చైతూ పక్కన నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ కాంబోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఇదే సినిమాలో పూజా హెగ్డే కూడా మరో నాయికగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు సమాచారం.