నవంబర్ 22 : నేటి రాశి ఫలాలు.. అసూయపరులతో జాగ్రత్త, విమర్శలను పట్టించుకోవద్దు
Horoscope Today : ఈరోజు రాశి ఫలాలు తేదీ 22 నవంబరు 2023 బుధవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి దినఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 22.11.2023, వారం: బుధవారం, తిథి : దశమి, నక్షత్రం : పూర్వాభాద్ర, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు జన్మరాశిలో గురుడు, అష్టమస్థానంలో రవి, బుధ, కుజులు సంచారం వలన మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. అష్టమరవి ప్రభావంచేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మీయొక్క సలహా కోసం ఆత్మీయులు, ఉన్నతవ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు ఎదురుచూస్తున్న రావలసిన గుర్తింపు గౌరవం లభిస్తుంది. దూరప్రదేశాల నుంచి సంతానపరంగా ఒక శుభవార్త వింటారు. స్థిరాస్తుల మీద ధనము అందుతుంది. వాటికి విలువ పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఆలోచనలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు అధికముగా ఉంటాయి. బంధుమిత్రులు కలుస్తారు. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు కళత్రస్థానములో రవి, బుధ, కుజుల సంచారం వలన మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తికొరకు అధిక పలుకుబడి ఉన్న వ్యక్తులను కలుస్తారు. వ్యయస్థానములో గురుని ప్రభావం వలన ఖర్చులు అధికమవుతాయి. నూతన ప్రణాళికలు వేస్తారు. రావలసిన ధనము అందుతుంది. సంతాన విషయంలో అభివృద్ధికరంగా ఉంటుంది. ఆత్మీయుల నుండి బహుమతులు అందుకుంటారు. బంధువుల సహకారంతో ఉద్యోగ సంబంధ చర్చలు, నూతన అవకాశాలు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం శ్రమ అధికంగా ఖర్చుచేస్తారు. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు శత్రు స్థానములో రవి, బుధ, కుజుల సంచారం వలన మరియు భాగ్యస్థానములో శని ప్రభావంచేత మధ్యస్థముగా ఉన్నది. సంతానానికి విదేశీ విద్య అవకాశాలు కోసం ముఖ్యుల్ని సంప్రదిస్తారు. ప్రయాణాలు చేస్తారు. ఆత్మీయ సభ్యులతో కలసి కుటుంబ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాతావరణం సందడిగా ఉంటుంది. వృత్తిపరమైన ప్రయాణాలకు అవకాశం. వృత్తి మార్పు విషయంలో తల్లిదండ్రులను సంప్రదిస్తారు. మిత్రులతో కలసి నూతన గృహ వాహన కొనుగోలు అంశముల గురించి ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు కోణమునందు రవి, బుధ, కుజుల సంచారం వలన మరియు అష్టమశని ప్రభావంచేత మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదావేస్తారు. ఆకస్మిక చికాకులు, మానసిక ప్రశాంతత లేకుండుట. కుటుంబముతో వాగ్వివాదములకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత ఆరోగ్యంలో కొంత ఇబ్బంది కలుగును. దూర ప్రయాణములకు అవకాశము. పలుకుబడి కలిగి మిత్రులైన రాజకీయ నాయకుల సహకారాన్ని కోరుకుంటారు. కుటుంబములోని స్త్రీలతో అభిప్రాయబేధములు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు కేంద్రమునందు రవి, బుధ, కుజుల ప్రభావంచేత అలాగే భాగ్యస్థానములో గురుని ప్రభావం వలన మీకు అనుకూలంగా ఉన్నది. పట్టుదలగా వ్యవహరించి అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యలో శ్రమకు తగిన గుర్తింపు గౌరవాన్ని పొందుతారు. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన వృత్తికి ప్రయత్నం చేసేవారికి అవకాశములు. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ తీసుకోవాలి. అనుకోని ఒత్తిడితో మనసుకు చికాకు కలుగును. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు తృతీయస్థానములో రవి, బుధ, కుజులు అనుకూలంగా ఉండటం, ఆరో శని స్థానములో శని అనుకూల ప్రభావంవలన మీకు మధ్యస్థంనుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపార అభివృద్ధి విషయంలో భాగస్వామితో చర్చలు. ఇంట్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. కుటుంబంలో వ్యక్తుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులు పోటీలో నెగ్గుతారు. రావాల్సిన రుణములు అందుతాయి. ప్రయాణములకు అవకాశం. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు వాక్ స్థానములో రవి, బుధ, కుజుల సంచారం వలన వ్యయస్థానములో శుక్ర, కేతువుల అనుకూలం వలన మీకు అనుకూలంగా లేదు. ఆత్మీయ బంధుమిత్రులను కలుస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సంతానానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు. మీరు చేస్తున్న వృత్తిలో తగిన గౌరవము, ఆదాయం అభివృద్ధి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. పరపతి పెరుగుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు జన్మరాశిలో రవి, బుధ, కుజుల ప్రభావం వలన మీకు అంత అనుకూలంగా లేదు. జన్మరవి ప్రభావం వలన పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. గృహ సంబంధ ఖర్చులు అధికముగా ఉంటాయి. విద్యపై శ్రద్ధ, జ్ఞాపకశక్తి పెంచుకోవాలి. సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రణాళికాపరంగా సద్వినియోగం చేసుకోవాలి. ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మీయులను సంప్రదించడం మేలు. భాగస్వామితో కలసి విశ్రాంత ప్రదేశములు మరియు క్షేత్ర సందర్శనలు కొరకు ప్రణాళికలు వేస్తారు. విద్యార్థులు హాస్టల్ వసతికై గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు తృతీయంలో శని, పంచమంలో గురుడు అనుకూల ప్రభావంచేత దశమంలో శుక్ర, కేతువుల అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. వారసత్వ ఆస్తుల విషయంలో కొంత చికాకులుంటాయి. పెద్దలు, గురువుల ఆశీస్సులు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. పనులు సకాలంలో జరుగుట వల్ల కొంత ప్రశాంతత ఉంటుంది. రావలసిన లాభాలను ఆకస్మికంగా అందుకుంటారు. నూతన వ్యక్తులను నమ్మి నిర్ణయాలు తీసుకోకూడదు. ఖర్చులు అధికముగా ఉంటాయి. సమయానికి విశ్రాంతి అవసరం. ఉన్నతాధికారుల మరియు రాజకీయముగా పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు వాక్‌స్థానములో ఏలినాటిశని ప్రభావం ఉన్నప్పటికి లాభములో రవి, కుజు, బుధుల అనుకూలత వలన మీకు మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలున్నాయి. రావలసిన ధనము కొంత వాయిదా పడే అవకాశాలున్నాయి. పరాక్రమం పెరుగుతుంది. తండ్రిని పెద్దలను సంప్రదించి స్థిరాస్తుల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి ఆహారం తీసుకుంటే మంచిది. కమ్యూనికేషన్ బాగుంటుంది. ప్రయాణావకాశాలున్నాయి. సమయాన్ని వృథా చేసుకోవద్దు. మిత్రులు, ఉన్నత అధికారంతో గల వ్యక్తులు సహకరిస్తారు. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు ఏలినాటి శని ప్రభావం అలాగే తృతీయంలో గురుని ప్రభావం మరియు దశమంలో రవి, బుధ, కుజుల అనుకూలత వలన మీకు మధ్యస్థముగా ఉన్నది. ప్రభుత్వ సంబంధ విషయాల్లో కొంత ఆలస్యాలు, ఆటంకాలు. దూరప్రదేశ ఆహ్వానాలు అందుకుంటారు. మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. వృత్తికి సంబంధించిన పని ముగించి ప్రశంసలు అందుకునే ప్రయత్నం చేస్తారు. సంతానం, తోబుట్టువులు సహకరిస్తారు. విద్యార్థులు పోటీలలో విజయం సాధించడానికి కృషి అధికంగా చేస్తారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు భాగ్యములో రవి, బుధ, కుజుల సంచారం వలన అలాగే ధనస్థానమునందు గురుని ప్రభావంచేత ఏలినాటి శని ఉన్నప్పటికి మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్య విషయంలో కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి ఆహారం, విశ్రాంతి అవసరం. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. అసూయపరులతో జాగ్రత్త. విమర్శలకు ప్రతిస్పందన వద్దు. వాహన కొనుగోలు విషయంలో పెద్దలను సంప్రదించి ప్రయత్నాలు మొదలుపెడతారు. పోటీల కొరకు, ప్రయాణములకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.