నవంబర్ 13 : నేటి రాశి ఫలాలు.. వీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి

 నవంబర్ 13 : నేటి రాశి ఫలాలు.. వీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి

Today Horoscope : ఈరోజు రాశి ఫలాలు తేదీ 13.11.2023 సోమవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు దిన ఫలాలు ఇక్కడ చూడండి.

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 13.11.2023, వారం: సోమవారం, తిథి : అమావాస్య నక్షత్రం : విశాఖ, మాసం : ఆశ్వయుజం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివస్తుంది. పిల్లల చదువులపై శ్రద్ధ చూపుతారు. వారి జయాజయాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలించును. కుటుంబముతో ఆనందముగా, ఆహ్లాదముగా గడుపుతారు. మేషరాశివారు ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు, ధనమును పొందెదరు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కలసివస్తుంది. గృహం యోగం కలుగుతుంది. గృహాలంకరణ వస్తువులు, లాభాలుంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో సంతోషంగా గడపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. గృహనిర్మాణాలు కలసివస్తాయి. ఇష్టమైనవారితో సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ప్రయాణాలు కలసివస్తాయి. అందమైన నూతన గృహంలో నివాసయోగం కలుగుతుంది. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ద్రవ్యలాభాలు, ప్రభుత్వం నుండి ఆదాయం పొందుతారు. నవరత్నాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశముంది. కర్కాటక రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన, పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీరు మీ కుటుంబముతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రభుత్వం నుండి ఆర్థిక లాభాలు పొందుతారు. శత్రువర్గంపై జయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. సింహరాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మరాశిలో శుక్రసంచారం వలన సంపద వృద్ధి అగును. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభదాయకం. విద్యార్థులకు అనుకూల సమయం. వివాహ అవకాశాలు కలసివచ్చును. వినోదాల్లో పాల్గొంటారు. ఆనందముగా గడుపుతారు. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు, లక్ష్యాలు నెరవేరుతాయి. మీ సహోద్యోగులు, స్నేహితుల నుండి ప్రశంసలు పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుడిని పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలొస్తాయి. శ్రమతో మీ పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగంలో ఒత్తిళ్లు, శ్రమ అధికముగా ఉండును. ప్రయాణాలు అనుకూలించును. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అనునిత్యం కృషిచేస్తూ ప్రగతి సాధిస్తారు. సంస్థలకు ఆధిపత్యం వహించి లాభాల బాటలో నడుపుతారు. మీరు అన్ని వర్గాలనుంచి గౌరవాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా అనుకూలించును. ధనూరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చలామణి అవుతారు. దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. సామాజికంగా గుర్తింపు వస్తుంది. అధికార వృద్ధి కలుగుతుంది. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన వ్యాపారాలకు, పెట్టుబడులకు అంత అనుకూలంగా లేదు. కళాపోషణకు విలువ ఇచ్చి ధనం ఖర్చు చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సంతానం విజయాలు సాధిస్తారు. పురోగమనం కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశముంది. ఆర్థిక విషయాలు గతం కంటే అనుకూలంగా ఉంటాయి. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *