నవంబరు 24, 2023: నేటి రాశి ఫలాలు.. ఏదీ మనసులోకి తీసుకోవద్దు
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు తేదీ 24.11.2023 శుక్రవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
వారం: శుక్రవారం, తిథి: ద్వాదశి,
నక్షత్రం: రేవతి, మాసం: కార్తీకం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో శ్రద్ధ వహించాలి. సరైన నిర్ణయాలు తీసుకోండి. నిందలు మోపేవారున్నారు. మొండితనం వద్దు. పట్టువిడుపులతో వ్యవహరించాలి. అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దు. స్వయంకృషితో అభివృద్ధిని సాధించండి. దృఢ సంకల్పంతో లక్ష్యాలను పూర్తిచేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా కలసివస్తుంది. ముఖ్యకార్యాల్లో విజయం సాధిస్తారు. అధికార యోగం సూచన. అనేక మార్దాల్లో విజయం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. సకాలంలో తీసుకున్న నిర్ణయాలు ఉజ్జ్వలమైన భవిష్యత్తునిస్తాయి. కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపారంలో సమయస్ఫూర్తితో అనుకున్న ఫలితాలు వస్తాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. శుభఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలం. మీకు వ్యాపారపరంగా కలిసేవచ్చే రోజు. సరైన నిర్ణయాలు తీసుకుని సత్ఫలితాలు సాధించాలి. కాలం అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు చేసే పనులు త్వరగా అభివృద్ధినిస్తాయి. ఆర్థికంగా కలసివస్తుంది. ఇబ్బందులు తొలగి ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. భూ గృహ వాహనయోగాలున్నాయి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నేటి దిన ఫలాలు అనుకూలంగా లేవు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సకాలంలో పనులు పూర్తి చేయాలి. చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది. కాబట్టి ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించాలి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. దగ్గరివారితో విభేదించరాదు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహ రాశి వారికి ఈరోజు మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా శుభయోగాలున్నాయి. అధికారులు ప్రశంసలు పొందుతారు. పదవీయోగ సూచన. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. వృత్తి నైపుణ్యాల్ని పెంచుకోవాలి. కుటుంబ సభ్యులతో కలసి ఆనందముగా గడుపుతారు. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించాలి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.
కన్యారాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ధర్మబద్ధంగా పనిచేయండి. కాలం వ్యతిరేకంగా ఉంది. ముఖ్య పనుల్లో శ్రద్ధ వహించాలి. ఎవరితోనూ విభేదించరాదు. కాలాన్ని సద్వినియోగం చేయడం మీదే దృష్టిపెట్టాలి. అభద్రతాభావాన్ని వీడాలి. ఏదీ మనసుకు తీసుకోవద్దు. ఆపదలు తొలగుతాయి. స్నేహితుల సూచనలు తోడ్పడుతాయి. వ్యాపారంలో కొత్తగా ఆలోచించాలి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.
తులా రాశి
తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. వ్యాపారయోగం అద్భుతంగా ఉంది. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉటుంది. అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. ఎక్కడా వెనకడుగు వేయవద్దు. వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోటవాలి. ఒక పనిలో విజయం సాధిస్తారు. మనోబలంతో పనులు ప్రారంభించండి. తులసీ మాతను పూజించండి. క్షీరాబ్ది ద్వాదశి అయినందున విష్ణుమూర్తిని పూజించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీరు ఆర్థికంగా ఆశించిన ఫలితం పొందుతారు. ధనధాన్యాభివృద్ధి విశేషంగా ఉంది. సంపదలు పెరుగుతాయి. మిత సంభాషణ మేలుచేస్తుంది. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయండి. ప్రారంభించిన పనిని మధ్యలో ఆపవద్దు. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. మంచివార్త వింటారు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. తులసీ మాతను పూజించండి. క్షీరాబ్ది ద్వాదశి అయినందున విష్ణుమూర్తిని పూజించండి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీకోసం మీరు పనిచేస్తే మంచి ఫలితం లభిస్తుంది. నలుగురికీ ఆదర్భంగా నిలుస్తారు. నూతన కార్యాలను ప్రారంభించేందుకు తగిన సమయం. శుభవార్త వింటారు. స్వల్చ ప్రయత్నంతోనే అదృష్టవంతులు అవుతారు. తులసీ మాతను పూజించండి. క్షీరాబ్ది ద్వాదశి అయినందున విష్ణుమూర్తిని పూజించండి.
మకర రాశి
మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. సకాలంలో పనులు పూర్తి చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అదృష్టయోగం ఉన్నది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో కోరుకున్నది లభిస్తుంది. విఘ్నాలు తొలగిపోతాయి. న్యాయపరమైన విజయం లభిస్తుంది. మిత్రబలం శక్తినిస్తుంది. సంపదలు పెరుగుతాయి. తులసీ మాతను పూజించండి. క్షీరాబ్ది ద్వాదశి అయినందున విష్ణుమూర్తిని పూజించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్థం నుండి అనుకూలం. ధనధాన్యాది లాభాలున్నాయి. ఆత్మవిశ్వాసం సడలకుండా పనిచేస్తే ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. దేనికీ తొందరపడవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో శ్రద్ధ వహించాలి. ప్రణాళికలు విజయాన్నిస్తాయి. తులసీ మాతను పూజించండి. క్షీరాబ్ది ద్వాదశి అయినందున విష్ణుమూర్తిని పూజించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో విభేదాలకు దూరంగా ఉండాలి. భయాందోళనలకు గురిచేసే అంశాలేవీ మనసుకు తీసుకోవద్దు. దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఆపదనుంచి బయటపడతారు. గందరగోళ పరిస్థితిని అధిగమించాలి. తులసీ మాతను పూజించండి. క్షీరాబ్ది ద్వాదశి అయినందున విష్ణుమూర్తిని పూజించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000