ధనత్రయోదశి, శని త్రయోదశి ఒకేరోజు రావటం విశేషమా! ఆరోజు ఏ రాశుల వారు ఏం చేయాలి?
త్రయోదశి తిథి 11 నవంబర్ 2023 శనివారం వస్తోంది. ఈరోజు ధనత్రయోదశి పూజ, శనివారం త్రయోదశి ఉండటంచేత శని త్రయోదశి కూడా వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
11 నవంబర్ 2023 శనివారం త్రయోదశి తిథి రోజునే ధనత్రయోదశి పూజ, అదేరోజు శని త్రయోదశి కూడా వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. చిలకమర్తి పంచాంగరీత్యా ధృక్ సిద్ధాంత గణితం ఆధారంగా 11 నవంబర్ 2023 స్థిరవారం త్రయోదశి మధ్యాహ్నం 1 గం॥ వరకు ఉండటంచేత ఈరోజు ధనత్రయోదశి అలాగే శని త్రయోదశి కూడా ఉన్నదని చిలకమర్తి తెలిపారు.
ఏలినాటి శని, అర్జాష్టమశని, అష్టమశని, జాతకంలో శని దోషాలు ఉన్నటువంటి వారు శని మహర్ధశ, శని అంతర్దశ వలన శని ప్రభావానికి ఇబ్బందికి గురైనటువంటి వారికి శని త్రయోదశి చాలా విశేషమైన రోజని చిలకమర్తి తెలిపారు. ఈ శని ప్రతయోదశి సందర్భంగా ఎవరైతే విశేషంగా ఆరోజు నవగ్రహ ఆలయాలను దర్శించి శనికి తైలాభిషేకం వంటివి చేసుకొని శనికి సంబంధించినటువంటి శాంతులు దానాలు చేసుకుంటారో వారికి శనిగ్రహానికి సంబంధించిన పీడలు, ఈతిబాధలు తొలగుతాయని చిలకమర్తి తెలిపారు.
11 నవంబర్ 2023 చిలకమర్తి పంచాంగరీత్యా మకర, కుంభ మీనరాశులవారు, కర్కాటక మరియు వృశ్చిక రాశులవారు శనిత్రయోదశి రోజున ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో నవగ్రహ ఆలయాలను దర్శించడం, శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, దశరథ ప్రోక్త శని సోత్రం వంటివి పఠించడం, నువ్వులు వంటివి దానం ఇచ్చుకోవడం వల్ల వారికి ఏలినాటి శని, అర్జాష్టమశని, అష్టమశని వంటి శనిగ్రహ బాధలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలియచేశారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మందపల్లి, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరునల్లార్ మరియు మహారాష్ట్రలో శని శింగపూర్ వంటి క్షేత్రాలను అవకాశం కొద్ది దర్శించుకొని నువ్వుల నూనెతో అభిషేకం వంటివి చేసుకున్నట్లయితే మరింత శభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలియచేశారు.
ఈరోజు ధన త్రయోదశి ఉండటంచేత నవగ్రహ ఆలయాలు దర్శించి శనిని ఆరాధించడం ఎలాంటి దోషము కాదు. అయితే నవగ్రహ ఆలయ దర్శనం శని పూజ వంటివి ఆచరించాక ఇంటియందు కాని ఆలయాల్లో కాని లక్ష్మీదేవిని పూజించి దీపారాధన వంటివి చేసినట్లయితే విశేషంగా ప్రదోష కాలంలో సాయంత్ర సమయంలో ధనత్రయోదశి తిధి ఉన్నటువంటి సమయంలో లక్షీపూజలు ఆచరించినటువంటివారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చిలకమర్తి తెలిపారు.