దీపావళి తర్వాత ఈ రాశుల వారికోసం సర్ ప్రైజ్ లు ఎదురుచూస్తున్నాయి

 దీపావళి తర్వాత ఈ రాశుల వారికోసం సర్ ప్రైజ్ లు ఎదురుచూస్తున్నాయి

ప్రస్తుతం శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. నవంబర్ 15 నుంచి శని ప్రత్యక్ష మార్గంలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కొన్ని రాశులకు మేలు జరుగుతుంది. వీరి కోసం కొన్ని సర్ ప్రైజ్ లు ఎదురుచూస్తున్నాయి. అవి ఏ రాశులకో చూసేయండి.

రెండు నెలల నుంచి శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. దీపావళి తర్వాత శని గమనం మారుతోంది. నవంబర్‌లో శని ప్రత్యక్షంగా మారబోతున్నాడు.

జ్యోతిషశాస్త్రంలో శని ప్రత్యక్షంగా ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

ఇది ప్రజల జీవితంలో అనేక సమస్యలను తొలగిస్తుంది. ప్రస్తుతం శని కుంభ రాశిలో ఉంది. రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని తన రాశిని మారుస్తాడు. అలా 2025 సంవత్సరంలో తన రాశిని మారుస్తుంది. ప్రస్తుతం దీపావళి తర్వాత శనీశ్వరుడు మారడం చాలా ప్రత్యేకంగా భావించాలని పండితులు తెలిపారు. శనిదేవుడు నవంబర్ 15 నుండి నేరుగా తన మూలకోణ రాశిలో సంచరించడం ప్రారంభిస్తున్నాడు. శని సంచారం ఈ ఏడాది మొత్తం అద్భుతమైన రాజయోగం ఇస్తోంది.

ఈ ఏడాది మొత్తం శని ఇస్తుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి మరో రెండు నెలల పాటు మంచి రోజులే ఉంటాయి. ఏ రాశులవారికి శనిదేవుని అనుగ్రహం లభిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి దీపావళి తర్వాత కాలం బాగానే ఉంటుంది. మీ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న గందరగోళం ఇప్పుడు సద్దుమణుగుతుంది.మీ చెడు పనులన్నీ పరిష్కరించబడటం ప్రారంభమవుతాయి. అందువల్ల ఇప్పుడు మీరు ఒత్తిడి నుండి ఉపశమనం పొందబోతున్నారు.

మీన రాశి
మీన రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇప్పుడు మునుపటి పరిస్థితుల నుండి ఉపశమనం పొందుతారు. కొన్ని కొత్త సర్ ప్రైజ్ లు వీరి కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ సమయంలో మీరు మీ ప్రేమ జీవితం, వృత్తిపరమైన జీవితంపై దృష్టి పెట్టాలి. పనులను కొత్తగా ప్రారంభించడానికి ప్రయత్నించాలి. వ్యాపారం చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి
మకర రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని మూడో దశ జరుగుతోంది. అందువల్ల వీరికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి.శని మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర రాశి మీద ఉన్న ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది. మకర రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న సమయం అంత మంచిది కాదు. కానీ ఇక నుంచి ఇది మీకు మంచి సమయంగా మారుతుంది. ఈ సమయంలో అందరి పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. అనవసరంగా ఎవరితోనూ గొడవలు పడటం, పనికిరాని విషయాలలో జోక్యం చేసుకోకండి. ప్రేమ జీవితంలో మీ ప్రయత్నాలను చూపించండి. అప్పుడే మీ ప్రేమ జీవితం సక్సెస్ అవుతుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *