దీపావళికి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే

 దీపావళికి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే

దీపావళి రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం అని చెబుతున్నాయి పురాణాలు. మీ ఇల్లు సకల సౌభాగ్యాలతో, సిరిసంపదలతో, పిల్లాపాపలతో తులతూగాలంటే ఆ రోజు మీరు పాటించాల్సిన నియమాలు ఇవే.

దీపావళి వచ్చిందంటే ఊరూవాడా దీపాలతో వెలిగిపోతుంది. ఆకాశం బాణాసంచాలతో మిరమిట్లు గొలుపుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసేదే దీపావళి పండుగ. ఆరోజు శ్రీ మహాలక్ష్మిని ధూప దీపాలతో పూజిస్తారు. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఖచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. దీపావళి రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం అని చెబుతున్నాయి పురాణాలు. మీ ఇల్లు సకల సౌభాగ్యాలతో, సిరిసంపదలతో, పిల్లాపాపలతో తులతూగాలంటే ఆ రోజు మీరు పాటించాల్సిన నియమాలు ఇవే.

ఇలా చేయండి

1. దీపావళికి ఒకరోజు ముందే మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఏ మూల కూడా బూజు లేకుండా చూసుకోండి. చెత్తాచెదారం ఉంచకండి. పగిలిపోయిన వస్తువులు, పాడైపోయిన ఆహారం ఇంట్లో లేకుండా చూడండి. దేవుడి పటాలను శుభ్రం చేసుకోండి. ఈశాన్య భాగంలో దేవుడిని ఉంచి గోపంచకంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయండి.

2. దీపావళి నాడు మీ ఇంట్లో ఏ మూల కూడా చీకటి లేకుండా చూసుకోండి. గదిలోనూ వెలుగుపడేలా చూడండి. ఇల్లంతా దీపాలు పెట్టలేము కనుక లైట్లు వేసి ఉండేలా చూసుకోండి.

3. స్వస్తిక్ గుర్తు హిందూమతంలో చాలా ప్రాధాన్యమైనది. ఇది చాలా పవిత్రమైనది కూడా. మీ ఇంటి ముఖ ద్వారం పై లేదా ఇంటి తలుపుపై స్వస్తిక్ గుర్తును వేయండి. లేదా బయట నుంచి స్వస్తిక్ గుర్తు స్టిక్కర్ తెచ్చి అతికించండి. ఇది ఆ ఇంటికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని అంటారు. కేవలం దీపావళి రోజే కాదు స్వస్తిక్ సింబల్ మీ ఇంటి తలుపుపై నిత్యం ఉండేలా చూసుకోండి.

4. పూజ చేసేటప్పుడు కచ్చితంగా ఉత్తరం వైపే చేయాలని గుర్తుపెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవి విగ్రహానికి ఎడమవైపున వినాయకుడి విగ్రహాన్ని పెట్టండి. చాలా మంది లక్ష్మీదేవి విగ్రహానికి మాత్రమే పూజ చేస్తారు, వినాయకుడి విగ్రహం కూడా ఉండాల్సిందే. ఇలా చేస్తే మీ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది.

6. ఇంట్లో నుంచి ధూపం వాసన వచ్చేలా ఉండాలి. ఇది పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి లాగుతుంది. అగరబత్తీలను దీపావళి రోజు ఇల్లంతా వెలిగించండి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.

7. దీపావళి రోజు మీ ఇంటి ప్రధాన తలుపును తెరిచే ఉంచండి. దీపావళి రోజు ఏ క్షణమైనా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని అంటారు. అందుకే రోజంతా ఇంటి తలుపును తీసే ఉంచండి. రాత్రి అయితే కిటికీనైనా తీసి ఉంచి పడుకోండి.

8. ఇంట్లో ఉన్న నెగెటివిటీని బయటికి పంపించాలంటే నీళ్లల్లో ఉప్పును కలిపి ఇంటి చుట్టూ చిలకరించండి. దీపావళికి ముందు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఇలా ఉప్పు నీళ్లు చల్లడం మర్చిపోవద్దు.

9. పూజ చేస్తున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కచ్చితంగా చదవండి. ఇంట్లో ఎలాంటి దోషమున్నా తొలగిపోతుంది. దీపావళి రోజు ఈ మంత్రాన్ని జపించడం ఎంతో ముఖ్యం.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *