తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ముహుర్తం ఫిక్స్, వారికి మాత్రమే కార్డులు

 తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ముహుర్తం ఫిక్స్, వారికి మాత్రమే కార్డులు

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి ఉత్తమ్ గుడ్‌న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. రేషన్ కార్డులతో పాటుగా.. సన్న బియ్యం కూడా

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయంలోనూ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో కుటుంబాలు వేరు పడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్నవారు రేషన్ కార్డుల కోసం ఆశగా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగనే రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల మంజూరుపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్డేట్ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు.

సంక్రాంతి తర్వాత తెలంగామలో కొత్త తెల్ల రేషన్‌కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. రేషన్‌కార్డులతోపాటు పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. వచ్చే రెండు, మూడు నెలల్లోనే సన్నబియ్యం పంపిణీని అమలు చేస్తామన్నారు. తెలంగామలో బియ్యం అక్రమ వ్యాపారాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రేషన్‌ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రేషన్‌ దుకాణాలకు సరఫరా అవుతున్న బియ్యం తూకాల్లో తేడాలు నివారించేందుకే వేబ్రిడ్జిలు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *