తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆలయం మూసివేత, భక్తులకు దర్శనాలు రద్దు
Tirumala Temple To Closed On March 3:
తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. మార్చి 3న చంద్రగ్రహణం
కావడంతో.. ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తారు. గ్రహణం ఆ రోజు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు ఉంటుంది. అంతేకాదు అదే రోజు కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లపై టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.
హైలైట్:
తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా
టీటీడీ అడిషనల్ ఈవో కీలక సమీక్ష
Tirumala Temple Closed
తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమలలో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 02వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పద్మావతి అతిథి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెప్పోత్సవాలకు భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
‘ఈ నెల 23వ తేదీ తెప్పల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ట్రయిల్ రన్.. పుష్కరిణీలో పుష్కలంగా నీరు ఉండేలా చర్యలు. పుష్కరిణీ, తెప్పలకు ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణ. వరహా స్వామి ఆలయం, నాలుగు మాడ వీధుల్లో పందిళ్లు ఏర్పాటు. భక్తులకు సూచనలు అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు. ఫిబ్రవరి 20 నుండి మార్చి 5వ తేది వరకు పుష్కరిణీ స్నానానికి భక్తులను అనుమతించరు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు. పుష్కరిణీలో అందుబాటులో గజ ఈతగాళ్లు. తెప్పోత్సవాలు ప్రాశస్త్యం తిరుమల శ్రీవారి భక్తులకు తెలిసేలా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఏర్పాట్లు. తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది’ అని తెలిపారు.
‘అనంతరం కుమారధార తీర్థ ముక్కోటిపై అదనపు ఈవో మార్చి 3న జరగనున్న సమీక్షించారు. మార్చి 3న ఉదయం 5 నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల పైన భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ ఉండదు. తదనుగుణంగా భక్తులు తమ ప్రణాళికలను రూపొందించుకుని తిరుమలకు రావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి. అనంతరం అదనపు ఈవో చంద్ర గ్రహణం రోజున చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మార్చి 3న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత. (మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 వరకు చంద్ర గ్రహణం.). వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రామ్ భగీచా, సీఆర్వోల వద్ద భక్తులకు దాదాపు 40 వేల పులిహోర ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు. ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు. వీటితో పాటు ఆరోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు’ చేశారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.