తిరుమల శ్రీవారి భక్తులకు బంపరాఫర్.. విమాన టికెట్ ధర రూ.2వేలు, జస్ట్ గంటన్నరలో తిరుపతికి వెళ్లొచ్చు

Rajahmundry To Tirupati Flight Service October 1st: రాజమహేంద్రవరం నుండి తిరుపతికి అక్టోబర్ 1 నుండి విమాన సర్వీసు ప్రారంభం కానుంది! ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరవుతారు. మొదటి రెండు రోజులు టికెట్ ధర కేవలం రూ.1,999 మాత్రమే. వారానికి మూడు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరాల మధ్య ప్రయాణం ఇక సులభతరం! ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • రాజమహేంద్రవరం తిరుపతి విమాన సర్వీస్
  • కేవలం రూ.1999కే తిరుపతికి దర్జాగా వెళ్లొచ్చు
  • అక్టోబర్ 1 నుంచి విమాన సర్వీస్ ప్రారంభం
Rajahmundry To Tirupati Flight
రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమాన సర్వీసు(ఫోటోలు- Samayam Telugu)
రాజమహేంద్రవరం-తిరుపతికి కొత్తగా విమాన సర్వీసు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 1న ఈ సర్వీసును కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభిస్తారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురందేశ్వరి కూడా పాల్గొంటారు. అయితే ఎలియన్స్‌ ఎయిర్‌ సంస్థ టికెట్‌ ధరను ప్రకటించింది.. ప్రారంభంలో టికెట్ ధర రూ.1,999 మాత్రమే అన్నారు. విమాన ప్రయాణికులను ఆకర్షించడానికి ఈ ఆఫర్ పెట్టారు. మొదటి రెండు రోజులు అంటే అక్టోబరు 1, 2 తేదీల్లో తక్కువ ధరకే టికెట్లు ఇస్తారు. తిరుపతికి వెళ్లే ప్రయాణికులందరూ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరం నుంచి ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్న తిరుపతికి ఈ కొత్త విమాన సర్వీసును నడపనున్నారు. అక్టోబర్ 1 నుంచి అలయన్స్ ఎయిర్ (ATR 72) సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపారు. వారంలో మూడు రోజులు ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త విమాన సర్వీసు ప్రారంభం కావడం పట్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. అక్టోబర్ 1న ఉదయం 7.40 గంటలకు తిరుపతి నుంచి విమానం బయల్దేరి రాజమహేంద్రవరానికి 9.25 గంటలకు చేరుకుంటుంది. ఈ విమానం తిరుగు ప్రయాణంలో ఉదయం 9.50 గంటలకు రాజమహేంద్రవరం నుంచి బయల్దేరి తిరుపతికి ఉదయం 11.20 గంటలకు చేరుకుంటుంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

కొత్త సర్వీసు ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే రాజమహేద్రవరంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచనకు అనుగుణంగా ఈ విమాన సర్వీస్ ఏర్పాటు చేశారు. తిరుపతి, తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ విమాన సర్వీసు సౌకర్యంగా ఉంటుంది. మొదటి రెండు రోజులు ప్రయాణికులకు రూ.1999కే విమాన టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *