తిరుమలలో అన్ని కంపార్ట్‌మెంట్లు ఫుల్‌.. సర్వదర్శనానికి 15 గంటల సమయం

 తిరుమలలో అన్ని కంపార్ట్‌మెంట్లు ఫుల్‌.. సర్వదర్శనానికి 15 గంటల సమయం

తిరుమల : వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం తిరుమల ( Tirumala )లో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలోని కంపార్ట్‌మెంట్లు ( Compartments ) అన్నీ నిండి ఏటీసీ వరకు క్యూలైన్లో నిలబడ్డారు.

టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి (Sarvadarsan ) 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న శ్రీవారిని 84,430 మంది భక్తులు దర్శించుకోగా 38,662 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Digiqole Ad

Related post