చెట్టుకు ఎర్రదారం కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఏయే చెట్లకు ఈ దారాన్ని కట్టచ్చు?

న్ని శతాబ్దాలుగా పాటిస్తున్న హిందూ సంప్రదాయాలలో చెట్టుకు ఎర్ర దారం కట్టడం కూడా ఒకటి. చాలా గుడిలలో మొక్కుబడిగా వీటిని చెట్లకు కడుతుంటారు. చెట్టుకు ఎర్రదారం కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి. ఏ చెట్టుకు కట్టాలి తెలుసుకుందాం.

చెట్టుకు ఎరుపు రంగు దారం కట్టడమనే ఆచారానికి హిందూ సంప్రదాయాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. కల్వా, రాఖీ, రక్షాబంధనం వంటి రకరకాల పేర్లతో పిలిచే ఈ దారాన్ని చెట్టుకు కట్టడ వల్ల కేవలం ఆధ్మాత్మిక సంబంధమే కాకుండా మనుషులకు, ప్రకృతికి మధ్య ఒక సంబంధాన్ని బయటపెడుతుంది. ప్రక‌ృతి పట్ల ప్రేమతో పాటు అంకితభావమున్న భక్తిని నెలకొల్పి ప్రశాంతతను అందిస్తుంది. హిందూ ఆచారాలలో చెట్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వాటి ముందు చేసే ప్రార్థనను నేరుగా అవి దేవుడి వరకూ చేరుస్తాయని బాగా విశ్వసిస్తారు. అందుకే ఎర్ర దారాన్ని చెట్టుకు కట్టి తమ మొర ఆలకించమని దేవుళ్లను వేడుకుంటారు. దేవుడు మన కోర్కెలు తీరుస్తాడని, అన్ని వేళలా తమకు రక్షగా ఉంటాడనే విశ్వాసంతో పాటుగా ప్రకృతి మనకు ఎంతైనా ఇవ్వగలదనే విశ్వాసంతో ఉంటారు.

మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీలను ఆ చెట్టు ఆకర్షిస్తుందని నమ్మకం. ఇలా కట్టడం వల్ల ఆ బంధనం, మనకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దాంతోపాటు దురదృష్టం మన దరికి చేరకుండా అడ్డుకుని అదృష్టవంతుల్ని చేస్తుంది. ఒక చెట్టుకు చుట్టూ దారం కట్టినప్పుడు అది మరింత గ్రౌండెడ్ గా ఉండి పరిసర వాతావరణంలో సామరస్య వైఖరిని సృష్టిస్తుంది.

వేప, మర్రిచెట్టు వంటి చెట్లకు ఇటువంటి ఆధ్మాత్మిక ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ చెట్లలో ఔషద గుణాలు కూడా ఉండటంతో వీటిని ప్రత్యేకంగా చూస్తుంటారు. మనసును లగ్నం చేసి చెట్టు చుట్టూ దారం కట్టి మొక్కుకోవడంతో అవి మనలో శక్తిని ప్రసరింపజేస్తాయని విశ్వసిస్తారు. అటువంటి సమయంలో నిర్మలమైన మనస్సుతో పవిత్రమైన దారాన్ని కట్టడం ద్వారా దైవంతో సంబంధాన్ని బలపరుస్తుంది. మరింత ఆచరణాత్మక ధోరణితో చూస్తే ఈ ఆచారం ప్రకృతి పట్ల సంపూర్ణతను ప్రోత్సహిస్తుంది. మానవులకు, పర్యావరణానికి ఉన్న పరస్పర అవసరాన్ని గుర్తు చేస్తుంటుంది.

ఈ ఆచారం కారణంగా ఇవ్వడం, స్వీకరించడం అనే రెండు విషయాలపై సమతుల్యత పెంపొందుతుంది. ఎర్ర దారం చెట్టుకు చుట్ట విశ్వాసం, ఆశ, నమ్మకం చెట్టుపై ఉంచుతాం. తిరిగి ఆ చెట్లు ఆక్సిజన్, నీడ, జీవితాన్ని అందిస్తుంటాయి. మానసికంగా ఇది ఒక రకమైన పాజిటివ్ ప్రక్రియ. సంప్రదాయబద్ధంగా లేదా ఆధ్మాత్మిక చర్యగా చూస్తే చెట్టుకు దారం కట్టడం అనేది ఎక్కువ ప్రాధాన్యతతో నిండిన విషయం. పర్యావరణ అవగాహనను పెంచి మన సంస్కృతులు, సంప్రదాయాల మూలాలను బలంగా ఉంచే సత్కార్యమనే చెప్పాలి.

చెట్టుకు దారం కట్టే సంప్రదాయం విషయంలో ఈ చెట్లలో ఒక్కో చెట్టుకు ఒక్క విశిష్టత ఉంది. మతపరమైన ప్రత్యేకతను, ఆధ్మాత్మికతను సంప్రదాయాలను కాపాడే చెట్లకు ఈ దారాన్ని కడతారు అవేంటంటే..

మర్రి చెట్టు

వేప చెట్టు

కొబ్బరి చెట్టు

అశోక చెట్టు

బోధి చెట్టు

మామిడి చెట్టు

రావి చెట్టు

మారేడు చెట్టు

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *