కొత్తగూడెం మేయర్‌ పీఠంపై ‘ఆటో డ్రైవర్’.. సీపీఐ నేత మూడ్‌ గణేష్ ప్రస్థానం ఇదే!

 కొత్తగూడెం మేయర్‌ పీఠంపై ‘ఆటో డ్రైవర్’.. సీపీఐ నేత మూడ్‌ గణేష్ ప్రస్థానం ఇదే!

ఒక సాధారణ డ్రైవర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆ వ్యక్తి.. ఇవాళ ఒక కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూర్చున్నారు. ఆయనే కొత్తగూడెం మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మూడ్ గణేష్. ఇటీవలి ఎన్నికల్లో సీపీఐ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో మేయర్ పీఠాన్ని అధిష్ఠించింది. కార్మికుల హక్కులు, సమస్యలపై పోరాటం చేస్తూ.. పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఆయన డ్రైవర్ స్థాయి నుంచి నేడు ఏకంగా
మేయర్‌గా ఎన్నికై ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

Mood Ganesh

కొత్తగూడెం మేయర్‌ పీఠంపై ‘ఆటో డ్రైవర్’.. సీపీఐ నేత మూడ్‌ గణేష్ ప్రస్థానం ఇదే

రాష్ట్రంలో, దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు కనుమరుగు అవుతున్న తరుణంలో.. ఇటీవల జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఎర్ర జెండా రెపరెపలాడింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన ఎర్రదండు.. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం 20వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన మూడ్ గణేష్.. మేయర్‌గా ఎన్నికయ్యారు.

అయితే ఒకప్పుడు సాధారణ ఆటో డ్రైవర్‌గా ఉన్న మూడ్ గణేష్.. ప్రస్తుతం కొత్తగూడెం మేయర్ కుర్చీపై కూర్చోవడంతో.. ఆయన ప్రస్థానం ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్ పార్టీ తరఫున 8వ డివిజన్ నుంచి గెలిచిన లలిత కుమారి ఎన్నికయ్యారు. అయితే కొత్తగూడెం మేయర్ పీఠాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని కాంగ్రెస్, సీపీఐలు నిర్ణయించుకోవడం గమనార్హం.

కొత్తగూడెం కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. అందులో సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు చెరో 22 స్థానాల్లో గెలిచాయి. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్‌ పదవి ఎవరు చేపడతారు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో సీపీఐకి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించడంతో.. మరింత ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఐ మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే తొలుత సీపీఐ తరఫున మూడ్‌ గణేష్‌ మేయర్‌ పీఠంపై కూర్చున్నారు.

సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మూడ్ గణేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఒకప్పుడు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించిన మూడ్ గణేష్.. ప్రైవేట్ వాహనాలకు డ్రైవర్‌గా పనిచేశారు. ఒకవైపు డ్రైవర్‌గా పనిచేస్తూనే.. మరోవైపు.. కార్మికుల సమస్యలపై పోరాటం చేసేవారు. ఏఐటీయూసీ అనుబంధ డ్రైవర్ల యూనియన్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొనే మూడ్ గణేష్.. కార్మికుల హక్కుల కోసం ఆందోళనలు, నిరనసలు చేసేవారు. అలా క్షేత్రస్థాయిలో వచ్చిన గుర్తింపుతో సీపీఐ పార్టీలో మూడ్ గణేష్.. బలమైన నేతగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. సీపీఐలో ఒక సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇటీవలి ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి.. ప్రస్తుతం మేయర్ పదవిని దక్కించుకున్నారు.

కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 58 స్థానాల్లో పోటీ చేసింది. ముందస్తు పొత్తులో భాగంగా సీపీఎం పార్టీకి రెండు స్థానాలు కేటాయించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా పొత్తులో ఉన్న సీపీఐ, కాంగ్రెస్.. కొత్తగూడెంలో మాత్రం విడివిడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తితో సీపీఐ వేరుగా బరిలోకి దిగింది. మొత్తం 57 స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ.. 22 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌ 8, ఇండిపెండెంట్లు 6, బీజేపీ, సీపీఎం చెరో డివిజన్‌లలో గెలిచాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *