కేసీఆర్, హరీశ్ లకు బిగ్ షాక్.. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్‌ కీలక నిర్ణయం

 కేసీఆర్, హరీశ్ లకు బిగ్ షాక్.. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్‌ కీలక నిర్ణయం

కాళేశ్వరం అవకతవకలపై  జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ చేపట్టిన విచారణ చివరి దశకు చేరుకుంది.  రేపటినుంచి క్రాస్ ఎగ్జామినేష్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనుంది. ఇందుకు గానూ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్‌ లను విచారణకు పిలిచే అవకాశం ఉంది.

కాళేశ్వరం అవకతవకలపై  జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణ చివరి దశకు చేరుకుంది.  రేపటినుంచి అంటే జనవరి 21వ తేదీ నుంచి జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ క్రాస్ ఎగ్జామినేష్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనుంది. ఇందుకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌ లను విచారణకు పిలిచే అవకాశం ఉంది.  వీరికి ఇవ్వాళ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

ప్రాజెక్టు నిర్మాణంలో కీలక నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలని నిర్ణయించిందెవరు?బ్యారేజీల వైఫల్యానికి కారణాలు ఏంటి? రీ ఇంజనీరింగ్‌తో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తేవడానికి కారణమేంటి? వంటి వివరాలను కమిషన్‌ సేకరించే అవకాశాలున్నాయి.

ఇప్పటికే జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ పలు దఫాలుగా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయగా..  ఇదే చివరి విడత కావచ్చని తెలుస్తోంది.  గతంలో నిర్వహించిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హాజరు కాలేదు. దీంతో ఈసారి కమిషన్‌ ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధమున్న నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీలు, ఇతర కీలక ఇంజనీర్లు, రిటైర్డ్‌ ఇంజనీర్లతో పాటు ఐఏఎస్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులను కమిషన్‌ ఇప్పటికే ప్రశ్నించింది.

కేసీఆర్ హాజరవుతారా లేదా

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై నివేదిక రూపకల్పనపై కూడా కమిషన్ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ ఈసారి సుదీర్ఘంగా సాగే అవకాశాలున్నట్లు తెలిసింది. విచారణతో పాటుగా సమాంతరంగానే నివేదికను కమిషన్ రెడీ చేస్తుంది.  దీనిపై వచ్చే నెలలో ప్రభుత్వానికి ఒక ప్రాథమిక నివేదిక అందించే అవకాశం ఉంది.  అయితే కమిషన్ విచారణకు నోటీసులు పంపితే కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తి నెలకొంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *