కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలతో నదీతీర క్షేత్రాల్లో భక్తుల రద్దీ.. ఇంద్రకీలాద్రిలో భక్తుల తాకిడి

 కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలతో నదీతీర క్షేత్రాల్లో భక్తుల రద్దీ.. ఇంద్రకీలాద్రిలో భక్తుల తాకిడి

కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. విజయవాడలో కృష్ణమ్మ చెంత మహిళలు దీపపు తెప్పలు వదిలారు.  (ఫోటోలు శంకర్ కొంకిమళ్ల, విజయవాడ)

కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిలో పుణ్యస్నానాలు చేసి విజయవాడ దుర్గాఘాట్‌లో  కృష్ణాతీరంలో దీపార్చన చేస్తున్న మహిళలు

కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలతో ఏపీలో సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మచిలీపట్నం సూర్యలంక, చీరాల, చినగంజాం, పెదగంజాం సముద్ర తీరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు స్నానమాచరించారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఘాట్లలో షవర్లను ఏర్పాటు చేశారు.

ఇంద్రకీలాద్రిపై కొలువైన మల్లేశ్వరుడిని దర్శించుకునేందుకు  పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు

కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఆలయాల్లో  దీపార్చనలు చేశారు.

కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి భవానీ దీక్షలను స్వీకరించారు.  భవానీ మండల  దీక్షల స్వీకరణకు గడువు పూర్తి కావొస్తుండటంతో పెద్ద ఎత్తున అమ్మవారి భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చి దీక్షలు చేపట్టారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసేందుకు పెద్దఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. నదిలో పుణ్యస్నానాలు చేసి మల్లేశ్వర స్వామికి పూజలు చేశారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణానదిలో తెల్లవారుజామున పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *