కాంగ్రెస్ మ్యానిఫెస్టో అదుర్స్…?

తెలంగాణా ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఫైనల్ మ్యానిఫెస్టో విడుదలకు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు పార్టీవర్గాలు
చెబుతున్నాయి. ఇప్పటికే డిక్లరేషన్ల పేరిట కొన్ని… హామీల పేరిట మరొకన్ని హామీలను…. వివిధ సందర్భాలలో
పార్టీ అగ్రనేతలు ప్రకటించేశారు. అయితే అన్నింటినీ కలిపి మ్యానిఫెస్టో రూపంలో ప్రకటించేందుకు సెప్టెంబర్
17వ తేదీని డెడ్ లైనుగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ రోజే ఎందుకంటే తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా
బీఆర్ఎస్ పై మ్యానిఫెస్టోతో దండయాత్ర మొదలు పెట్టడానికట.
అధికారంలోకి వస్తే కాంగ్రెస్ మ్యానిఫెస్టో అమలుచేస్తామంటున్న సోనియా గాంధి చేపట్టే సంక్షేమ పథకాల
తదితరాలపై పార్టీ ఇప్పటికే డిక్లరేషన్ పేరుతో కొన్ని హామీలను ఇచ్చేసింది. వరంగల్ సభలో రాహుల్ గాంధితో
రైతుల డిక్లరేషన్, ప్రియాంకగాంధి ద్వారా యూత్, మహిళా డిక్లరేషన్ ప్రకటించారు. రైతులకు రు. 2 లక్షల రుణమాఫీ…
….రు. 15 వేల పెట్టుబడి సాయం….. ధరణి పోర్టల్ రద్దు….. పోడు భూముల విక్రయాలకు హక్కులు…. అమరవీరులకు
నెలకు రు. 25 వేల పెన్షన్…. 2 లక్షల ఉద్యోగాల భర్తీ…. నిరుద్యోగులకు నెలకు రు. 4 వేల పెన్షన్….రు. 10 లక్షల వడ్డీలేని
రుణం లాంటి హామీలను గుప్పించింది.
ఓట్లు కోసం జనాలకు దగ్గరయ్యేందుకు మ్యానిఫెస్టో అనో ఏదోరూపంలో ఏ పార్టీ అయినా అనేక హామీలను
ఇస్తుంటుంది. అయితే పార్టీలిచ్చే హామీలను….. ప్రకటించే మ్యానిఫెస్టోలను ….జనాలు నమ్ముతున్నారా ?
అంటే ?లేదనే సమాధానం వస్తోంది. ఎందుకంటే మ్యానిఫెస్టో అని కాకపోయినా జనాలను నమ్మించేందుకు హామీలైతే
ఇవ్వాల్సిందే కదా. హామీలిచ్చే నేతల విశ్వసనీయతను కూడా జనాలు ఆలోచిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో రైతులకు
రు 2 లక్షల రుణమాఫీ , లక్షల ఉద్యోగాల భర్తీపేరుతో నిరుద్యోగులకు, ఎస్సీ, ఎస్టీలకు తలా 3 ఎకరాలని కేసీయార్
నోటికొచ్చిన హామీలను గుప్పించారు. ఇందులో ఏ ఒక్కటీ అమలుచేయలేదు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇపుడు రుణమాఫీ ప్రారంభించారు. అందుకనే పార్టీలిచ్చే హామీలను,
మ్యానిఫెస్టోలను నమ్మటం జనాలు ఎప్పుడో మానేశారట. కాకపోతే ఇచ్చే వ్యక్తులను బట్టి కొన్ని పార్టీ లను
నమ్ముతున్నారంతే. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నారు… అని…. దానికి
కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన… హామీలే నిదర్శనమని… కాంగ్రెస్ చెప్తుంది.
హామీలేమో బారెడు… తీర్చేది మూరెడు… అన్నట్టుంది…. రాజకీయ నాయకుల పరిస్థితి