ఓ పక్కన నిలబడి కోట్లు కొల్లగొట్టిన పందెం కోడి

 ఓ పక్కన నిలబడి కోట్లు కొల్లగొట్టిన పందెం కోడి

సైలెంట్‌గా నిలబడి కోట్లు కొట్టేసింది ఓ కోడి. భీమవరంలో జరిగిన కోళ్ళ పందాల్లో ఓ కోడి అస్సలేమీ పోరాడకుండానే తన యజమానికి కాసుల వర్షం కురిపించింది.గిరిలో మిగతా కోళ్ళు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తూ నిలబడి..చివరికి విజేతగా నిలిచి.. 1.25 కోట్లు ప్రైజ్ సాధించింది.

సంక్రాంతికి ఆంధ్రాలో జరిగే కోడి పందాలు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. జూదమని తెలిసినా అందరూ ఆడుతుంటారు. దీని కోసం ఏడాదంతా ఎదురు చూస్తున్నారు. తమ కోళ్లను పందేల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. వాటికి మంచి తిండి పెడుతూ శిక్షణ ఇప్పిస్తారు. ఇందులో కొందరని అదృష్టం వరిస్తే మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది. కోట్లలో పందాలు జరుగుతుంటాయి.

ఈసారి జరిగిన కోడి పందాల్లో ఓ కోడి మాత్రం హైలెట్ గా నిలిచింది. అస్సలేమీ కష్టపకుండా..ఫైట్ చేయకుండానే తన యజమానికి 1 కోటి 25 లక్షలు సంపాదించి పెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఈ సంఘటన వైరల్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఎలా జరిగింది..

భీమవరంలో ఒకచోట ఒకేసారి ఐదుకోళ్ళ మధ్య పందెం పెట్టారు. గిరి గీసి అన్నిటినీ వదిలారు. ఇందులో నాలుగు కోళ్ళు రెచ్చిపోయాయి. వీర పుంజుల్లా ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి..తెగ కొట్టుకున్నాయి. అయితే ఒక కోడి మాత్రం నాకేమీ సంబంధం లేదన్నట్టు ఓ పక్కన నిలుచునుంది. ఈలోపు మిగతా నాలుగు కోడళ్ళల్లో ముందు రెండు రెడు కొట్టుకుని కొట్టుకుని పడిపోయాయి. తరువాత మిగతా రెండిటిలో ఒకటి కిందపడిపోయింది.  ఇక తప్పదు పక్కన నిల్చున్న కోడి ఫైట్ చేయాల్సిందే అనుకున్నారు అంతా. కానీ ఈ లోపు అప్పటివరకు బాగానే ఉన్న నాలుగో కోడి కూడా కుప్పకూలిపోయింది. దీంతో అస్సలేమీ ఫైట్ చేయకుండా ఉన్న కోడిని విజేతగా డిక్లేర్ చేశారు.

ఏమీ చేయకుండానే పందెంలో గెలిచిన కోడిపుంజుకు ఏకంగా రూ.1.25 కోట్లు బహుమతిగా దక్కింది. దీంతో కోడి యజమానికి పట్టలేని ఆనందం వచ్చింది. అప్పనంగా అంత డబ్బు వచ్చేసరికి అతని ఆనందం అవధులు దాటింది. కోడిపుంజును పట్టుకుని ఆ ప్రాతమంతా తిరిగాడు. విజేతను ఊరేగించినట్టు ఊరేగించాడు. దీని తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాలు కదపకుండా గెలిచింది అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గొడవలు జరుగుతున్నప్పుడు సైలెంట్‌గా ఉండడమే ఉత్తమమైన మార్గం అని కామెంట్లు పెడుతున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *