ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియమితులు కాబోతున్నారు. కూటమి నేతలు ఆయన పేరును ప్రతిపాదించగా.. ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.
ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన పేరును మంగళవారం ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి బుధ, గురు వారాల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనప్రాయం మాత్రమే.
2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్ సభ స్థానం నుంచి వైసీపీ తరుఫున గెలిచారు. తరువాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం పై తిరగబడ్డారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతిని, అక్రమాలను ప్రజలకు తెలియజేశారు.
దీంతో వైసీపీ ప్రభుత్వం ఆయన పై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్ర హింసలకు గురి చేసిన సంగతి తెలిసిందే. జగన్ వ్యవహారాలను గురించి మాట్లాడటం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఏపీలో అడుగుపెట్టలేదు. చాలా సంవత్సరాలు ఢిల్లీలోనే ఉండి ఎన్నికలు ముగిసిన తరువాత ఏపీకి తిరిగి వచ్చారు.
2024 ఎన్నికల ముందు ఆయన వైసీపీ కి రాజీనామా చేసి టీడీపీలో చేరి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
నిన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ను నియమించిన ప్రభుత్వం ఈరోజు శాసనసభ, ఆసన మండలి విప్, ఛీఫ్ విప్‌లను నియమించింది. ఏపీ శాసనసభ చీఫ్ విప్‌గా వినుకొండ తెదేపా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలిలో చీఫ్‌విప్‌గా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఇందులో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ ఎమ్మెల్యేలకు విప్‌లుగా అవకాశం లభించింది.
శాసనసభలో విప్‌లు వీరే..
ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు(బీజేపీ)
అరవ శ్రీధర్, కోడూరు -ఎస్సీ(జనసేన)
బెందాళం అశోక్ – ఇచ్ఛాపురం (టీడీపీ)
బొలిశెట్టి శ్రీనివాస్- తాడేపల్లిగూడెం (జనసేన)
బొమ్మిడి నారాయణ నాయకర్- నరసాపురం (జనసేన)
బొండా ఉమామహేశ్వరరావు- విజయవాడ సెంట్రల్ (టీడీపీ)
దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు)- ముమ్మిడివరం (టీడీపీ)
దివ్య యనమల- తుని (టీడీపీ)
వి.ఎం.థామస్- గంగాధర నెల్లూరు(ఎస్సీ) (టీడీపీ)
జగదీశ్వరి తోయక – కురుపాం(ఎస్టీ) (టీడీపీ)
కాలవ శ్రీనివాసులు- రాయదుర్గం (టీడీపీ)
మాధవి రెడ్డప్పగారి – కడప (టీడీపీ)
పీజీవీఆర్ నాయుడు(గణబాబు)- విశాఖ వెస్ట్(టీడీపీ)
తంగిరాల సౌమ్య- నందిగామ (ఎస్సీ) (టీడీపీ)
యార్లగడ్డ వెంకట్రావు- గన్నవరం (టీడీపీ)
శాసనమండలిలో విప్‌లు
వేపాడ చిరంజీవి రావు(టీడీపీ)
కంచర్ల శ్రీకాంత్ (టీడీపీ)
పి.హరిప్రసాద్ (జనసేన)