ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ఈ నెల కూడా లేనట్లే.. ఆ రెండు మాత్రం ఇస్తారు

 ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ఈ నెల కూడా లేనట్లే.. ఆ రెండు మాత్రం ఇస్తారు

Andhra Pradesh Ration Distribution Toor Dal: ఏపీలో నేటి నుంచి ప్రభుత్వం రేషన్‌ను పంపిణీ చేయనుంది. అయితే ఈ నెల కూడా కష్టమే అంటున్నారు. ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు.. కందిపప్పు సరఫరా మే నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. గతంలోనూ కందిపప్పు సరఫరా అంతకంతకూ తక్కువైంది.. ప్రభుత్వం మే నెలనుంచి కందిపప్పు సరఫరా చేస్తామని చెబుతున్నారు. రేషన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి ఈ నెల కూడా బ్యాడ్‌న్యూస్.. ఏప్రిల్‌లో కూడా కందిపప్పు కష్టంగానే మారింది. అయితే ఫిబ్రవరిలో రేషన్ కార్డులు ఉన్నవారికి కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది.. కానీ మార్చిలో ఇస్తారని భావించినా కుదరలేదు.. ఏప్రిల్ కూడ కష్టం అంటున్నారు. నేటి నుంచి రేషన్ పంపిణీ మొదలు కానుంది. కానీ, వినియోగదారులకు కేవలం బియ్యం, పంచదార మాత్రమే అందుబాటులో ఉంటాయంటున్నారు. అయితే కందిపప్పు పంపిణీలో సమస్యలు కొనసాగుతున్నాయి.. ఈ నెల కష్టమేనని మే నెల నుంచి కందిపప్పు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. గోధుమ పిండిని మాత్రం ప్రజలు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.

ప్రభుత్వం నేటి నుంచి రేషన్ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, గత మూడు నెలలుగా కందిపప్పు సరఫరా లేకపోవడంతో.. బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం బియ్యం, చక్కెరతో పాటు కందిపప్పు, చిరుధాన్యాలు కూడా ఇస్తామని చెప్పింది. కొన్ని నెలలు కందిపప్పు, జొన్నలు ఇచ్చారు. దాంతో అన్నీ వస్తాయని ప్రజలు అనుకున్నారు. నవంబర్‌లో కందిపప్పు మాత్రమే ఇచ్చారు. డిసెంబర్‌లో అసలు ఇవ్వలేదు.. జనవరి, ఫిబ్రవరిలో కూడా ఇదే పరిస్థితి. ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ రేషన్ పంపిణీ మొదలవుతుంది. ఈసారి కూడా బియ్యం, చక్కెరను రేషన్ షాపులకు పంపించారు. బియ్యం, పంచదార మాత్రమే గోదాములకు చేరాయి. ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా ఉచితంగా బియ్యం, తక్కువ ధరకు పంచదార ఇస్తున్నారు.

గతేడాది వర్షాలు లేకపోవడంతో కంది పంట సరిగా పండలేదు.. దాని వల్ల దిగుబడి తగ్గిపోయింది. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.180 వరకు ఉంది.. వ్యాపారులు ప్రభుత్వం చెప్పిన ధరకు కందిపప్పు ఇవ్వలేమని చెప్పారు. అందుకే గత తొమ్మిది నెలల్లో రెండు నెలలు మాత్రమే కందిపప్పు, గోధుమ పిండి ఇచ్చారు. దీనిని రేషన్ కార్డు ఉన్నవాళ్ళకు మే నెల వరకు వేచి చూడక తప్పదు. అప్పటి వరకు బియ్యం, పంచదారతోనే సరిపెట్టుకోవాలి. ప్రభుత్వం కందిపప్పు సమస్యను త్వరగా పరిష్కరించాలని రేషన్‌కార్డులు ఉన్నవారు కోరారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *