ఎంత బరితెగించార్రా : ఛీ.. ఛీ .. స్కూల్లో ఏంటీ పాడు పనులు
రాజస్థాన్‌లోని ఓ స్కూల్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు కామకోరికలతో రెచ్చిపోయారు. తమ అసభ్య పనులకు పాఠశాలనే అడ్డాగా మార్చుకున్నారు. ఇద్దరిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
రాజస్థాన్‌లోని ఓ స్కూల్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు కామ కోరికలతో రెచ్చిపోయారు. తమ అసభ్య పనులకు ఏకంగా పాఠశాలనే అడ్డాగా మార్చుకున్నారు.
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లా గంగ్రార్ బ్లాక్‌లోని సలేరా గ్రామంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్, మహిళా ఉపాధ్యాయురాలు మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఆఫీసు రూమ్ లోనే ముద్దులు పెట్టుకోవడంతో పాటుగా అంతకుమించిన పనులను కొనసాగించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది.
ఇద్దరిని సస్పెండ్
సోషల్ మీడియాలోనూ ఈ వీడియోలు వైరల్ గా మారడంతో ఉన్నాతాధికారులు చర్యలు చేపట్టారు. వీడియో దృశ్యాలను పరిశీలించిన విద్యాశాఖ అధికారి రాజేంద్ర కుమార్ శర్మ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై విచారణ చేసేందుకు విద్యాశాఖ ముగ్గురు గెజిటెడ్ అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఐదు రోజుల్లో నివేదికను సమర్పిస్తుంది.