ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ

‘ఊరు పేరు భైరవకోన’
మూవీ రివ్యూ నటీనటులు:
సందీప్ కిషన్-వర్ష బొల్లమ్మ-కావ్య థాపర్-వడివుక్కరసు-రవిశంకర్-హర్ష చెముడు-జయప్రకాష్-మీమ్ గోపి తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: రాజ్ తోట మాటలు: భాను-నందు
నిర్మాత: రాజేష్ దండ కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీఐ ఆనంద్ ఒక మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. తనకు ‘టైగర్’ లాంటి హిట్ ఇచ్చిన వీఐ ఆనంద్ తో కలిసి చేసిన కొత్త సినిమా.. ఊరు పేరు భైరవకోన. విడుదలకు ముందే మంచి అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ: బసవ (సందీప్ కిషన్) సినిమాల్లో ఫైటర్ గా పని చేసే కుర్రాడు. అతను ఒక పెళ్లి ఇంట్లోకి చొరబడి పెళ్లి కూతురి కోసం చేయించిన నగలన్నీ దోచుకుని వెళ్లిపోతాడు. వాటి విలువ నాలుగు కోట్లు. తన స్నేహితుడితో కలిసి ఆ నగలు తీసుకుని పారిపోతున్న అతడిని హైవేలో మనుషులను దోచుకునే గీత (కావ్య థాపర్) యాక్సిడెంట్ పేరుతో ట్రాప్ చేస్తుంది. ఈ ముగ్గురూ కలిసి అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి ప్రవేశిస్తారు. అక్కడికి వెళ్లాక ఈ ముగ్గురికీ అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. వాళ్ల కారు.. నగలు మాయం అవుతాయి. వాటిని ఎలాగైనా తిరిగి సంపాదించాలని చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ క్రమంలోనే ఆ ఊరి గురించి సంచలన విషయాలు తెలుస్తాయి బసవకు. ఇంతకీ ఆ ఊరి కథేంటి.. బవస అసలు ఆ దొంగతనం ఎందుకు చేశాడు.. ఆ ఊరికి అతడికి ఉన్న కనెక్షన్ ఏంటి.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.