ఉత్కంఠకు తెర.. కాళేశ్వరంపై కేసీఆర్‌ విచారణ పూర్తి.. కేసీఆర్‌ను కమిషన్ అడిగిన ప్రశ్నలు ఇవే!

 ఉత్కంఠకు తెర.. కాళేశ్వరంపై కేసీఆర్‌ విచారణ పూర్తి.. కేసీఆర్‌ను కమిషన్ అడిగిన ప్రశ్నలు ఇవే!

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ మార్పు, NDSA రిపోర్ట్, మేడిగడ్డ కుంగుబాటు, నిధుల ఖర్చుపై కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్ని్ంచింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందుకు బీఆర్‌ఎస్‌ అధినేత రావడం ఒక్కరోజు హడావుడి కాదిది. గులాబీ దళపతికి నోటీసులు అందిన దగ్గర నుంచి ఇదే చర్చ.. ఇదే రచ్చ..! ఆయనొస్తారా? రారా..? వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? కొన్నాళ్లుగా తెలుగు రాజకీయాల్లో ఇదే దుమారం నడుస్తోంది. వీటన్నింటికీ పుల్‌స్టాప్‌ పెడుతూ.. ఎట్టకేలకే కమిషన్‌ ముందుకొచ్చారు కేసీఆర్‌.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇటీవల కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాత.. తెలంగాణ రాజకీయాల్లో ఏర్పడిన ఉత్కంఠకు ప్రస్తుతానికి ఇలా తెరపడింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను విచారించడంతో.. కాళేశ్వరం విచారణ తుదిఘట్టాన్ని పూర్తిచేసుకుంది. ఎర్రవల్లిలో కేసీఆర్‌ కాన్వాయ్‌ ప్రారంభమైంది మొదలు.. బీఆర్‌కే భవన్‌కు చేరుకునే వరకు.. ఆ తర్వాత ఆయన విచారణను ముగించుకుని వెళ్లిపోయేవరకు.. ప్రతీ సీన్‌ ఆద్యంతం రసవత్తరం అనిపించింది. బుధవారం(జూన్ 11) ఉదయం 11గంటలకు బీఆర్కే భవన్‌ చేరుకున్న కేసీఆర్‌కు చేరుకోగా.. అప్పటికే భారీస్థాయిలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఆయనకు మద్దతుగా అక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అలెర్టయిన పోలీసులు ఆ చుట్టుపక్కల 200మీటర్ల వరకు ఎవరినీ రానీయకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కేసీఆర్‌ విచారణ జరుగుతున్నంత సేపు.. ఆ ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మొదట బహిరంగ విచారణ జరుగుతుందని భావించినా.. కేసీఆర్‌ విజ్ఞప్తిని అంగీకరించి, 12గంటలకు వన్‌ టు వన్‌ విచారణ ప్రారంభించారు జస్టిస్‌ ఘోష్‌. యాభై నిమిషాల పాటు కేసీఆర్‌కు కీలక ప్రశ్నలు సంధించారు. 12.55కు బయటకు వచ్చిన కేసీఆర్‌.. కారులోంచే కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయారు. అయితే, కాళేశ్వరంపై కేసీఆర్‌ నుంచి జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ కీలక సమాచారం తీసుకుంది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ అడిగినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి రీ ఇంజనీరింగ్‌పై కమిషన్‌కు కేసీఆర్‌ వివరించినట్టు సమాచారం.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *