ఈ రాశుల వారికి లక్.. డబ్బు, ఆనందం దక్కుతుంది

బుధుడు త్వరలో నక్షత్రం మారనున్నాడు. నవంబర్ 1వ తేదీన అనూరాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి శుభాలు కలగనున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
డబ్బు, మాటలు, వ్యాపారం, వివేకానికి బుధుడు కారకుడు. బుధుడి సంచారం రాశులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి బుధుడు అతిత్వరలో నక్షత్రం మారబోతున్నాడు.
బుధుడు నవంబర్ 1వ తేదీన ఉదయం 6.46 గంటలకు అనూరాధ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 11వ తేదీ వరకు ఆ నక్షత్రంలో సంచరిస్తాడు. ఇందువల్ల ఈ కాలంలో కొన్ని రాశులపై సానుకూల ప్రభావం ఉంటుంది. వీరికి ధనం సహా మరిన్ని ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఉన్నాయి.
మిథునం: మిథున రాశి వారికి బుధుడు అధిపతి. అందుకే అనూరాధ నక్షత్రంలో బుధుడి సంచారం ఈ రాశి వారికి శుభంగా ఉంటుంది. వీరికి ధన యోగం ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సొంతం అయ్యే అవకాశం ఉంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. కొత్త పనులను మొదలుపెడతారు.
తుల: అనూరాధ నక్షత్రంలో బుధుడి సంచారించే కాలం తులా రాశి వారికి మేలు జరుగుతుంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. సమాజంలో గౌరవం అధికమవుతుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది.
కన్య: ఈ కాలంలో కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు జరగొచ్చు. ఆర్థికంగా సానూకూలంగా ఉంటుంది.