ఈ రంగుదారాలను కట్టుకుంటే ఈ రాశులవారికి మహారాజ యోగం

తరుచుగా ఆలయాలకు వెళ్లినప్పుడు, పూజల్లో పాల్గొన్నప్పుడు, వ్రతాలు చేసిన సమయంలోను చేతులకు దారాలను కట్టుకుంటాం. ఆపదల నుంచి కాపాడుతుందనే నమ్మకంతో వాటిని ధరిస్తాం. అయితే కొన్నిచోట్ల ఇటువంటి పవిత్రమైన దారాలను స్టైల్ కోసం ధరించేవారు ఎక్కువయ్యారు. ఒక్కో దారాన్ని బట్టి వాటి ఫలితం ఆధారపడివుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ప్రజలు అనేక విషయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. తమ ఇళ్లల్లో వాస్తుదోషాలతో సహా ఇతర విషయాలపట్ల ఎంతో జాగ్రత్త అవసరం. కుడిచేతుల్లో దారం కట్టేటప్పుడు రాశిచక్రం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చేతులకు ముడి దారం లేదంటే కాలవను కట్టుకుంటే కచ్చితంగా విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. రోజు, రాశి ప్రకారం ముడిదారమే కాకుండా బట్టలు కూడా వేసుకోవాలి.
వృషభం, కర్కాటకం, తుల రాశి వారు తమ చేతులకు తెల్లటి ముడి దారాన్ని, మిథున రాశి, కన్యా రాశి వారు తమ చేతులకు పచ్చని (గ్రీన్) రంగు దారాన్ని కట్టుకోవాలి. దీనివల్ల భగవంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ధనుస్సు, మీన రాశి వారు తమ చేతులకు పసుపు రంగు పట్టు దారం లేదంటే ముడి దారం, మకర, కుంభ రాశి వారు నీలిరంగు దారాన్ని కట్టుకోవాలి. దాని వల్ల విశేష ప్రయోజనం కలుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని చర్యలను ప్రయత్నించడం ద్వారా మీరు విశేష ఫలితాలను పొందవచ్చని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. తమ తమ రాశిని బట్టి ఆయా రంగు దారాలను ధరించడంవల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు.. చేసే పనిలో మంచి పురోగతి కనపడుతుంది