ఈగల్’లో నవదీప్.. ‘లవ్, మౌళి’ కోసం రవితేజ

Navdeep Love Mouli Jukebox నవదీప్ 2.ఓ అనేట్టుగా లవ్, మౌళి అనే చిత్రం రాబోతోంది. ఆల్రెడీ నవదీప్ గెటప్, లుక్స్ అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. లవ్, మౌళి కోసం నవదీప్ ఉత్తరాదికి వెళ్లి షూటింగ్‌లో బాగానే కష్టాలు పడ్డ సంగతి తెలిసిందే.
ప్రధానాంశాలు:
- ఈగల్ మూవీలో నవదీప్
- లవ్, మౌళి జ్యూక్ బాక్స్
- నవదీప్ కోసం వచ్చిన రవితేజ
నవదీప్ ఈ మధ్య ఈగల్ టీజర్, ట్రైలర్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. చాాలా రోజుల తరువాత స్టార్ హీరో సినిమాలో మంచి రోల్ దక్కినట్టుగా కనిపించింది. అయితే ఈగల్‌లో రవితేజతో కలిసి నటించాడు నవదీప్. అందుకే నవదీప్ సినిమాను ప్రమోట్ చేసేందుకు రవితేజ కూడా ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తోంది.
లవ్, మౌళి చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు ‘ద యాంథమ్ ఆఫ్ లవ్ మౌళి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.