ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.300కే కనెక్షన్

 ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.300కే కనెక్షన్

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను పెంచేందుకు కేంద్రప్రభుత్వం భారత్ నెట్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిసెంబర్ 8వ తేదీన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరకే కేవలం రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను ఇవ్వనుంది. అయితే ఈ కనెక్షన్ ఖరీదు రూ.300 అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ కనెక్షన్‌ను మొదట దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో అమలు చేయనున్నారు.

ఈ భారత్ నెట్ పథకాన్ని మొదటిగా కొన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేస్తారు. ఈ పథకం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.2500 కోట్లను కేటాయించింది. ఈ కనెక్షన్‌ను 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇస్తారు. ప్రతి ఇంట్లో ఉన్న టీవీలే ఈ కనెక్షన్‌తో కంప్యూటర్లగా మారుతాయి.

కేవలం ఇంటికే ఈ భారత్ నెట్ కనెక్షన్‌ను ఇవ్వడంతో పాటు గ్రామాల్లో ఉన్న అన్ని కార్యాలయాలకు, పాఠశాలలకు కూడా ఇస్తారు. టీవీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ కంప్యూటర్ ఉంటే పిల్లల చదువుకి ఉపయోగపడుతుంది. అలాగే ఈ కనెక్షన్‌తో ప్రతీ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇవి పోలీస్ కంట్రోల్ రూమ్‌తో లింక్ ఉంటాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *