ఆ ఉద్యోగులు ఇకపై రోజుకు 10 గంటలు పనిచేయాలి.. ఏపీ అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం

 ఆ ఉద్యోగులు ఇకపై రోజుకు 10 గంటలు పనిచేయాలి.. ఏపీ అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం

Andhra Pradesh Daily Working Hours Increase: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీలలో పని గంటలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు 8 గంటల నుండి 10 గంటలకు పని గంటలు పెంచుతూ శాసనసభ బిల్లును ఆమోదించింది. అయితే వారానికి 48 గంటల పని విధానంలో మార్పు లేదు. మహిళలు రాత్రిపూట పనిచేయడానికి అనుమతిస్తూ, రవాణా, భద్రత సంస్థలదే బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓవర్ టైం పరిమితిని కూడా పెంచారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిగంటలపై కీలక నిర్ణయం తీసుకుంది. షాపులు, సంస్థలు, ఫ్యాక్టరీలలో పని గంటలు పెంచే బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం.. పని గంటలు రోజుకు 8 నుంచి 10 గంటలకు పెరగనున్నాయి. అయితే వారానికి 48 గంటల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ మేరకు ఏపీ దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు-2025, ఫ్యాక్టరీస్‌ సవరణ బిల్లు-2025 లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శాసనసభలో ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం షఆపుల్లో, సంస్థల్లో రోజుకు 8 గంటలు పని ఉంటుంది. కొత్త బిల్లు ప్రకారం ఇది 10 గంటలకు పెరుగుతుంది. ఫ్యాక్టరీలలో ఇదివరకు 9 గంటలు ఉండగా, ఇప్పుడు 10 గంటలకు పెంచారు. ఇక్కడ కూడా వారానికి 48 గంటలే పని గంటలు ఉంటాయి. ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి విశ్రాంతి సమయం కూడా కలిపి 12 గంటలు మించకూడదు. ప్రతి ఆరు గంటలకు అరగంట విరామం ఇవ్వాలి. అంతేకాకుండా, ఓవర్ టైం పరిమితిని కూడా పెంచారు. ఇదివరకు మూడు నెలలకు కలిపి 75 గంటలు ఓవర్ టైం చేసేందుకు అనుమతి ఉండగా.. ఇప్పుడు దానిని 144 గంటలకు పెంచారు. ఈ మేరకు సవరణ బిల్లు-2025, ఫ్యాక్టరీస్‌ సవరణ బిల్లు-2025 లను ఆమోదించారు.

ఇకపై మహిళలు రాత్రిపూట కూడా ఫ్యాక్టరీలు, దుకాణాలు, సంస్థల్లో పనిచేయవచ్చు. ప్రస్తుతం ఉన్న రాత్రి షిఫ్టుల సమయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసేందుకు అనుమతి లభిస్తుంది. అయితే, మహిళల అనుమతి తప్పనిసరి. వారికి రవాణా, భద్రత కల్పించాల్సిన బాధ్యత సంస్థలదే. ప్రస్తుతం ఫ్యాక్టరీలలో రాత్రి 7 గంటల వరకు, దుకాణాల్లో రాత్రి 8.30 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఈ సమయాన్ని ఉదయం 6 గంటల వరకు పొడిగించారు. మహిళల భద్రత కోసం ఇంటి నుండి పని ప్రదేశానికి రవాణా సౌకర్యం కల్పించాలి. 20 మంది కంటే తక్కువ సిబ్బంది ఉన్న చిన్న దుకాణాలు, సంస్థలకు కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, వారు కూడా కొన్ని ముఖ్యమైన రూల్స్ పాటించాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *