ఆపిల్ పాలకూర సలాడ్ ఒక గిన్నెలో ఆపిల్‌ను సన్నగా తరగాలి. పాలకూరను కూడా సన్నగా తరిగి కలుపుకోవాలి. పావు కప్పు దానిమ్మ గింజలను, ఉల్లిపాయ తరుగు, ఉప్పు, మిరియాల పొడి, బాదం, పిస్తా వంటి గింజల తరుగును వేసి బాగా కలపాలి. ఇది రుచికరంగా ఉంటుంది. దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం, ఫొలేట్ కూడా అందుతుంది. కాబట్టి బరువు త్వరగా తగ్గుతారు. పోషకాహార లేమి కూడా రాదు. పైన చెప్పిన సలాడ్లను నెలరోజుల పాటు తింటే చాలు. మీకే మీ బరువులో తేడా కనిపిస్తుంది. శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. మూడు నెలల్లోనే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

Bellam Appalu: సాయంత్రం అయితే పిల్లలకు స్నాక్స్ గా ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? ఒకసారి బెల్లం అప్పాలు పెట్టి చూడండి.

Bellam Appalu: స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు స్నాక్స్ కోసం మారాం చేస్తారు. బయట దొరికే పదార్థాలను ప్రతిరోజూ పెడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంట్లోనే తయారు చేసి పెట్టడం మంచిది. ముఖ్యంగా వారికి పోషకాహారలేమి, రక్తహీనత రాకుండా చూసే ఆహారాలను తినిపించాలి. పిల్లలు అధికంగా రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వారికి బెల్లంతో చేసిన స్నాక్స్ ను తినిపిస్తే మంచిది. అలాంటి వాటిల్లో బెల్లం అప్పాలు ఒకటి. వీటిని తయారు చేయడం చాలా సులువు. ఒక్కసారి తయారు చేసుకుంటే వారం రోజులు పాటు నిల్వ ఉంటాయి. వీటిని తినిపించడం వల్ల శరీరానికి శక్తి అందడంతో పాటు ఐరన్ పుష్కలంగా చేరుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య రాదు. రక్తహీనత సమస్య లేని పిల్లలు ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. నీరసం వారి దరిచేరదు. ఇప్పుడు బెల్లం అప్పాలు ఎలా తయారు చేయాలో చూద్దాం.

బియ్యప్పిండి – ఒక కప్పు

బొంబాయి రవ్వ – ఒక కప్పు

బెల్లం తురుము – రెండు కప్పులు

గోధుమపిండి – ఒక కప్పు

యాలకుల పొడి – ఒక స్పూను

కొబ్బరి తురుము – అరకప్పు

నెయ్యి – నాలుగు స్పూన్లు

నూనె – సరిపడినంత

బెల్లం అప్పాల తయారీ

1. ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యప్పిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి తురిమిన బెల్లాన్ని వేసి మూడు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి.

3. బెల్లం నీళ్లు మరుగుతున్నప్పుడే యాలకుల పొడిని, ఎండుకొబ్బరి తురుమును, రెండు స్పూన్ల నెయ్యి వేసి కలపాలి.

4. ఇప్పుడు చిన్న మంట మీద ఉంచి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి.

5. గరిటతో కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటాయి. ఉండలు కడితే బెల్లం అప్పాలు సరిగా రావు.

6. మొత్తం పిండిని వేసాక బాగా కలిపి ఉండలు లేవని నిర్ధారించుకున్నాక మూత పెట్టాలి. ఒక నిమిషం పాటు ఉడికించాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి.

7. పిండి కాస్త వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చపాతీలకు ఎలా అయితే ఉండలు కట్టుకుంటామో అలా ఉండలు చుట్టుకోవాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *