అక్టోబర్‌ ప్రారంభంలో శుక్రుడు తన రాశి మార్చుకోబోతున్నాడు. శుక్ర సంచారం ప్రభావం వల్ల అనేక రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.

 అక్టోబర్‌ ప్రారంభంలో శుక్రుడు తన రాశి మార్చుకోబోతున్నాడు. శుక్ర సంచారం ప్రభావం వల్ల అనేక రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.

జ్యోతిష శాస్త్రంలో శుక్రుడుని సంతోషమూ, సంపద, సౌభాగ్యము, విలాసాలకు కారకుడిగా భావిస్తారు. శుక్రుడు ఏ రాశిలో నైనా 23 రోజుల పాటు ఉండి ఆ తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం శుక్రుడు కర్కాటకంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2 న అర్ధరాత్రి 12:43 గంటలకు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడి రాశి అయిన సింహ రాశిలోకి శుక్రుడి ప్రవేశం చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. శుక్ర సంచారం ప్రభావం వలన అనేక రాశుల వారు శుక్రుని అనుగ్రహంతో ఆర్థిక ప్రయోజనాలతోపాటు పురోభివృద్ధి సాధిస్తారు. శుక్ర సంచారం ప్రభావంతో ఏ రాశుల వారు తమ జీవితాన్ని మార్చుకుంటారో ఇక్కడ తెలుసుకోండి.

మేషరాశి
మేషరాశి వారికి ఈ సంచారం ఈ రాశిచక్రంలోని ఐదో ఇంట్లో ఉంటుంది. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక పనిలో కొత్త బాధ్యతలు పొందుతారు. ఈ సమయంలో మీరు చాలా దూరం ప్రయాణం చేస్తారు.

వృషభరాశి
వృషభ రాశి వారికి శుక్రుడు తొమ్మిదవ ఇంటిలో సంచరిస్తున్నందున శుక్ర సంచార ప్రభావం వల్ల సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశముంది. నూతన ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. సింహ రాశిలో శుక్రుడి సంచారం కాలంలో మీరు వృత్తికి సంబంధించిన కొత్త అవకాశాలను పొందుతారు.

సింహరాశి
సింహ రాశిలో శుక్రుడి సంచారం చాలా శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిషశాస్త్రం గణాంకాల ప్రకారం ఈ సమయం మీకు వరం కంటే తక్కువేమీ కాదు. శుక్రుడు మీ మొదటి ఇంట్లో ఉన్నందున ఇది గొప్ప అదృష్ట సమయం. పూర్వీకుల ఆస్తిలో పెరుగుదలను మీరు చూడవచ్చు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మీరు పెట్టుబడిపై చాలా రాబడిని పొందుతారు. ఈ కాలంలో వ్యాపారాలు విస్తరిస్తాయి. వ్యాపారంలో లాభాలను కూడా పొందుతారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *