అంబాజీపేట మ్యారేజిబ్యాండు

అంబాజీపేట మ్యారేజిబ్యాండు మూవీ రివ్యూ
నటీనటులు: సుహాస్ – శివాని నాగారం – శరణ్య – రమణ గోపరాజు – జగదీష్-నితిన్ ప్రసన్న తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: వాజిద్ బేగ్
నిర్మాత: ధీరజ్ మొగిలినేని
రచన – దర్శకత్వం: దుష్యంత్ కటికనేని
కలర్ ఫోటో.. రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించాడు యువ నటుడు సుహస్. అతడి కొత్త చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండులోనూ మంచి కంటెంట్ ఉన్నట్లే కనిపించింది ప్రోమోలు చూస్తే. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
మల్లి (సుహాస్) అంబాజీపేటలో నాయీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. అతడి తండ్రి ఊర్లో సెలూన్ షాపు నడుపుతుంటాడు. మల్లి అందులో పని చేస్తూనే.. మరోవైపు మ్యారేజీ బ్యాండులోనూ సభ్యుడిగా ఉంటాడు. అతడి కవల సోదరి అయిన పద్మ (శరణ్య) ఊర్లోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆమె మీద వడ్డీ వ్యాపారం చేస్తూ ఊరిని పట్టి పీడిస్తున్న అగ్ర కులస్థుడు వెంకట్ (నితిన్ ప్రసన్న) కన్ను ఉంటుంది. మరోవైపు వెంకట్ చెల్లెలైన లక్ష్మి (శివాని నాగారం)తో మల్లి ప్రేమలో పడతాడు. వెంకట్ కు ఈ విషయం తెలిసి.. పద్మ పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తాడు. తనకు ఎదురొచ్చిన మల్లిని కూడా ఘోరంగా అవమానిస్తాడు. దీంతో ఊర్లో తలెత్తుకోలేని స్థితికి చేరుకుంటుంది వీరి కుటుంబం. తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకు మల్లి.. పద్మ ఏం చేశారు.. దాని పర్యవసానాలేంటి.. వీరి జీవితాలు చివరికి ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.